దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతిరోజూ రికార్దు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలకు గ్లెన్‌మార్క్‌ శుభవార్త చెప్పింది. యాంటీవైరల్ డ్రగ్ ఫావిపిరవిర్ ధరను 27 శాతం తగ్గించింది. ఫాబిఫ్లూ టాబ్లెట్‌ ధరను కేవలం 75 రూపాయలకు అందిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. 
 
ఇతర దేశాలలో ఫావిపిరవిర్ ఖర్చుతో పోల్చితే భారత్ లో అతి తక్కువ ధరకే ఈ టాబ్లెట్ అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఇండియాలో తయారు కావడం, అధిక ఉత్పత్తి కారణంగా తక్కువ ధరకే ఈ టాబ్లెట్ ను అందుబాటులోకి తెచ్చినట్టు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ మాలిక్ తెలిపారు. కరోనా రోగులకు తమ ఔషధం మరింత చేరువ అవుతుందని ఆశిస్తున్నామని వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: