గత కొన్ని రోజులుగా ఏపిలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. ప్రతిరోజూ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ప్రభుత్వం ఓ వైపు ఎన్ని రకాలుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. కేసులకు మాత్రం అడ్డు కట్ట వేయలేకపోతుంది.  ఏపిలో కరోనా బీభత్సం మరింత పెరిగింది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో కొత్త‌గా 1,935 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా  37 మంది మృత్యువాత పడ్డారు.  తాజా కేసుల‌తో క‌లిపి మొత్తం కేసుల సంఖ్య 31,103కి చేరింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో 14,274 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి 16,464 మంది కోలుకున్నారు. 

 

ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా 365 మ‌ర‌ణాలు సంభ‌వించాయని అధికారులు తెలిపారు.  అనంతపురం జిల్లాలో ఆరుగురు, కర్నూలు జిల్లాలో నలుగురు, తూర్పు గోదావరి జిల్లాలో నలుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో నలుగురు, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, కడప జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు, విజయనగరం జిల్లాలో ఒకరు మరణించినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: