దేశం మొత్తం ఇప్పుడు కరోనా పేరు చెబితే భయంతో వణికిపోతున్నారు. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత మనిషి జీవన విధానమే మారిపోయింది.  ఎవరైనా తుమ్మినా.. దగ్గినా భయంతో చూస్తున్నారు. ఇక మాస్క్ అనేది జీవితంలో ఒక భాగం అయ్యింది.  కరోనా మహమ్మారి నుంచి ఎవరిని వారు కాపాడుకోవడానికి మాస్క్ తప్పని సరి అని వైద్యులు, ప్రభుత్వాలు చెబుతున్నాయి.  బయటకు వస్తే సోషల్ డిస్టెన్స్ తప్పకుండా పాటించాలని అంటున్నారు. కానీ కొంత మంది మాత్రం ఇవేవీ తమకు పట్టనట్టుగా ప్రవర్తిస్తున్నారు.

 

లాక్ డౌన్ ఉల్లంఘనలు పాటించకుండా ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో, మాస్క్ లేకుండా బయటకు వచ్చే వారిపై జరిమానాలను కూడా విధిస్తున్నారు. తాజాగా మాస్క్ లేని వారిపై బెంగళూరు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నెల రోజుల వ్యవధిలో ఏకంగా రూ. కోటి జరిమానా విధించారు. జూన్ 9 నుంచి జులై 10 వరకు మొత్తం రూ. 1.01 కోట్లను వసూలు చేశారు. 

 

అయితే ఇందులో మాస్కులు లేకుండా బయటకు వచ్చినవారిపై 46,959 కేసులు.. 3,747 కేసులను సోషల్ డిస్టెన్స్ పాటించనందుకు విధించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. బెంగళూరు పోలీసులు, నగర మున్సిపల్ అధికారులు జాయింట్ టీమ్ గా ఏర్పడి నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: