దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ పెరిగిపోతోంది. కేసుల సంఖ్యలో తొమ్మిది లక్షల మార్కును దాటేసింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 28,498 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 553 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.  కరోనా వైరస్ సోకిన వారిని క్వారంటైన్ లోకి వెళుతున్న విషయం తెలిసిందే. మరికొంత మంది కరోనా సోకిన వారితో సన్నిహితంగా ఉన్నవారు వారికి వారే ‌సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి  వెళ్తున్న విషయం తెలిసిందే.

 

తాజాగా జ‌మ్ముక‌శ్మీర్ బీజేపీ అధ్య‌క్షుడు ర‌వీంద్ర రైనాకు క‌రోనా పాజిటివ్ అని తేలడంతో.. ఇటీవ‌ల ఆయ‌న‌తో క‌లిసి జ‌మ్ముక‌శ్మీర్‌లో ప్ర‌యాణం చేసిన కేంద్ర‌మంత్రి జితేంద్ర సింగ్ సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లాల్సి వ‌చ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర‌మంత్రి జితేంద్ర‌సింగ్  ‌సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లారు. నేను జూలై 12న ర‌వీంద్ర రైనాతో క‌లిసి శ్రీన‌గ‌ర్ నుంచి బందిపొరా వ‌ర‌కు ప‌ర్య‌టించాను.  ర‌వీంద్ర రైనాకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌న్న వార్త తెలిసిన వెంట‌నే నేను సెల్ఫ్ క్వారెంటైన్ విధించుకున్నా అని జితేంద్ర‌సింగ్ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: