ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ లో ఈరోజు తెల్లవారు జామున సాంకేతిక లోపం తలెత్తింది. వాట్సాప్ యూజర్లకు ఫోన్ లో యాప్ ఓపెన్ కాలేదు. ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం అందుతోంది. యాప్ ఓపెన్ కాకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. కొందరు యూజర్లు యాప్ ఓపెన్ కాకపోవడంతో సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేశారు. కొందరు యూజర్లు ఫోన్ రీస్టార్ట్ చేయగా మరికొందరు యూజర్లు అప్లికేషన్ అన్‌ ఇన్‌స్టాల్‌ చేసి మరలా ఇన్‌స్టాల్ చేసుకున్నారు. 
 
అయితే కొంత సమయం తరువాత వాట్సాప్ పని చేసింది. భారత కాలమాన ప్రకారం తెల్లవారు జామున 1.32 గంటలకు వాట్సాప్‌ సర్వీసులో సమస్య తలెత్తింది. కంపెనీ ఈ సమస్యపై ఇప్పటివరకూ స్పందించలేదు. గతంలో కూడా వాట్సాప్ యూజర్లకు ఇలాంటి సమస్య తలెత్తింది. వాట్సాప్ డౌన్ అంటూ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అయింది. తిరిగి యథావిధిగా సర్వీసు ప్రారంభం కావడంతో కస్టమర్లు ఊపిరి పీల్చుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: