ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూపెరుగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ వస్తే మాత్రమే వైరస్ ను నియంత్రించడం సాధ్యమవుతుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 9 లక్షలు దాటగా మృతుల సంఖ్య 23,727కు చేరింది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో పలు దేశాల ప్రభుత్వాలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. 
 
ఈ క్రమంలో యూకే కూడా పలు కఠిన నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. ఈ నెల 24 నుంచి బహిరంగ ప్రదేశాలతో పాటు షాప్స్ లో మాస్కులను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ధరించకపోతే వంద పౌండ్ల పెనాల్టీ విధించనున్నట్లు కీలక ప్రకటన చేసింది. భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.10 వేల రూపాయలు పెనాల్టీని విధించనుంది. యూకేలో ఇప్పటివరకు 2.91 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా 45 వేల మందికి పైగా మరణించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: