ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు వస్తే ఏ ఆసుపత్రిలోను వైద్యం నిరాకరించకూడదని ఆదేశాలు జారీ చేశారు. వైద్యం నిరాకరిస్తే వాటి అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కరోనా నియంత్రణ గురించి అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం రాష్ట్రంలో శాశ్వత పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 
 
కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియల కొరకు 15వేల రూపాయలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అధికారులు రాష్ట్రంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వైద్యుల నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపారు. 17వేల మంది వైద్యులు, 12 వేల మంది నర్సులను నియమించుకునే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు సీఎంకు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: