తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖలో కొత్తగా 2,000 మంది ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. రాష్ట్రంలో మున్సిపల్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలతో పాటు పాతవాటిలో కూడా ఉద్యోగులను మున్సిపల్ శాఖ రిక్రూట్ చేసుకోనుందని తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ నిన్న మున్సిపల్ శాఖపై సమీక్ష నిర్వహించి అధికారులతో ఈ అంశం గురించి చర్చించారు. 
 
ప్రధానంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, సివిల్ ఇంజనీర్లు, బిల్ కలెక్టర్, సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం జాబితా రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని కొత్త మున్సిపాలిటీల్లో ముగ్గురు, నలుగురుకు మించి సిబ్బంది లేరు. ప్రస్తుతం అధికారులు ప్రతిపాదనలు అందజేయనుండగా రిక్రూట్‌‌మెంట్‌‌పై సీఎం కేసీఆర్ త్వరలో తుదినిర్ణయం తీసుకోనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: