దేశంలో క‌రోనా కేసులు రోజు రోజుకు విజృంభిస్తున్నాయి. ఇప్ప‌టికే 9 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు మ‌రో రెండు రోజుల్లో 10 ల‌క్ష‌లు దాటేయ‌నున్నాయి. నిన్న ఒక్క రోజే ఏకంగా 28 వేల పై చిలుకు క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. ఇక క‌రోనా దెబ్బ‌తో ప‌లు పార్టీల అగ్ర‌నేత‌లు సైతం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. తాజాగా క‌రోనా ఎఫెక్ట్‌తో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సైతం సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు. 

 

ఇక భార‌త్‌లో  కరోనా నియంత్రణకు ఇకనైనా కఠినమైన చర్యలు చేపట్టకపోతే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి అదుపు తప్పుతుందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ హెచ్చరిక కూడా చేశారు. ఇక దేశంలో 86 శాతం కరోనా పాజిటివ్‌ కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 50 శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడులోనే ఉన్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు 30 వేలు దాటేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: