ఇండియన్ రైల్వేస్ తన ప్రయాణికుల కోసం వినూత్నమైన సేవలు అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఫిట్ ఇండియా కార్యక్రమం లక్ష్యాలను చేరుకునేందుకు ట్రైన్ జర్నీ చేసే వారి కోసం రైల్వే స్టేషన్లలో హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేయడం మొదలు పెట్టింది. ఇప్పటికే ఇండియన్ రైల్వేస్ లక్నో రైల్వే స్టేషన్‌లో రెండు హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేయడం గమనార్థకం.


లక్నో రైల్వే స్టేషన్‌లోని హెల్త్ ఏటీఎం దాదాపు 16 హెల్త్ చెకప్‌ సర్వీసులను ప్రజలకు ఇస్తుంది. ఈ  సర్వీసుల కోసం కేవలం రూ.50-రూ.100 చెల్లిస్తే చాలు. రెండు రకాల హెల్త్ చెకప్‌లు ఉంటాయి. ఒకటేమో 9 నిమిషాల చెకప్. రెండోదేమో 6 నిమిషాల చెకప్. 9 నిమిషాల చెకప్‌కు రూ.100 చెల్లించ వలసి వస్తుంది. అదే 6 నిమిషాల చెకప్‌కు రూ.50 చెల్లిస్తే చాలు.


ఇక ఏకంగా హెల్త్ చెకప్ రిపోర్ట్‌ను వెంటనే కూడా వారు అందించడం జరుగుతుంది. స్మార్ట్‌ఫోన్‌‌కు మెయిల్ కూడా పంపిస్తారు . యోలో హెల్త్ ఏటీఎం స్టేట్ అధికారి అమ్రేశ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘రోజుకు 50-60 మంది హెల్త్ ఏటీఎం సదుపాయాలను అందిస్తున్నాము. జ్వరం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు సులభంగానే చూపించుకోవచ్చు. దీంతో జర్నీని కొనసాగించాలా? వద్దా? అని నిర్ణయించుకోవచ్చు’ అని తెలియచేయడం జరిగింది.


ప్రస్తుతం హెల్త్ ఏటీఎంలు కేవలం లక్నో స్టేషన్‌లో మాత్రమే అమలులోకి వచ్చింది. అయితే ఇండియన్ రైల్వేస్ హెల్త్ ఏటీఎంలను రానున్న కాలంలో ఇతర స్టేషన్లలోనూ ఏర్పాటు చేయాలని భవనలో ఉంది. దీంతో రైల్వే ప్రయాణికులకు ప్రయోజనం లభిస్తుంది అని అధికారులు అనుకుంటున్నారు. ఎలాంటి సమస్య ఐనా బాడీ మాస్ ఇండెక్స్, బ్లడ్ ప్రెజర్, బాడీ ఫ్యాట్, హీమోగ్లోబిన్, మెటబాలిక్ ఏజ్, మజిల్ మాస్, వెయిట్, హైట్, టెంపరేచర్, బసల్ మెటబాలిక్ రేటింగ్, ఆక్సిజన్ శాచురేషన్, పల్స్ రేట్, బ్లడ్ గ్లూకోజ్, బోన్ మాస్ వంటివి హెల్త్ చెకప్‌లో భాగంగా ఉన్నాయి అంటే నమ్మండి. అతి తక్కువ ధరకే ఇలాంటి సేవలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండటం గమనార్హం అనే చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: