ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఆన్ లైన్ ప్రెమెంట్స్ అని చాలా రకాల  యాప్ లను ఉపయోగిస్తున్నారు. అందులో ముఖ్యంగా  గూగుల్ పే కచ్చితంగా ఉంటుంది. ఈ యాప్  అల్ఫాబెట్‌కు చెందిన గూగుల్ పేమెంట్ యాప్. ఈ యాప్ సాయంతో నేరుగా డబ్బులను  ఇతరుల అకౌంట్‌లోకి  అటువంటి చార్జీలు లేకుండా సులువుగా పంపవచ్చు. ఇలా పేమెంట్ చేసిన తర్వాత మనకి స్క్రాచ్ కార్డు లభిస్తుంది.


ఈ  స్క్రాచ్ కార్డును స్క్రాచ్ చేస్తే  చిన్న మొత్తంలో డబ్బులు కూడా పొందవచ్చు. కానీ ప్రతి స్క్రాచ్ కార్డుకు ఇలా మనము గెలుచు కోకపోవచ్చు. మనకి చాలాసార్లు ఎలాంటి డబ్బులు కూడా రావంటే నమ్మండి. ప్రస్తుతం గూగుల్ పే మరింత మంది కస్టమర్లకు చేరువ కావాలని ప్రయత్నం చేస్తుంది. అందుకే యాప్ ద్వారా పర్సనల్ బ్యాంక్ చెకింగ్ అకౌంట్స్ ఫెసిలిటీని కూడా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. రాబోయే సంవత్సరం నుంచే ఈ సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకొని రావాలని భావిస్తోంది. గూగుల్ ఇప్పటికే సిటీగ్రూప్, స్మాల్ క్రెడిట్ యూనియన్‌తో జత కట్టడం జరిగింది. ఈ సేవలు ముందుగా అమెరికాలో  అందుబాటులోకి వస్తాయి అని అంచనా వేస్తున్నారు.


తాజాగా ఫేస్‌బుక్  కూడా ఫేస్‌బుక్ పే లాంచ్ చేయడం జరిగింది, యాపిల్ కూడా క్రెడిట్ కార్డుల ఆవిష్కరణతో ముందుకు దూసుకెళ్లుతుండటంతో గూగుల్ కూడా పేమెంట్స్ విభాగంపై బాగా మార్పులు తీసుకొని రావాలనే భావనలో ఉంది. తాజా  గూగుల్ ఒప్పందంపై అమెరికా రెగ్యులేటర్స్ అండ్ లా మేకర్స్ కొన్ని ఆందోళనలు వ్యక్తం చేయడం జరిగింది. డేటా ప్రైవసీ అంశాన్ని తెరమీదకు తీసుకొని రావడం కూడా చూసాము. అయితే ఈ అంశంపై గూగుల్ వారితో చర్చ కూడా కొనసాగుతుంది.


అంతే కాదు...  గూగుల్ వచ్చే సంవత్సరం నుంచి చెకింగ్ అకౌంట్స్ సర్వీసులును అందుబాటులోకి తీసుకొని రావాలనే భావనలో ఉంది. కాగా గూగుల్‌ పేకు భారత్‌లో 6.7 కోట్లకు పైగా యూజర్లు ఉండడం గమనార్థకం.


మరింత సమాచారం తెలుసుకోండి: