ప్రముఖ ఫోన్ల సంస్థ ఐనా  రియల్ మీ సంస్థ నుంచి 5జీ ఫోన్లను లాంచ్ చేస్తామని రియల్ మీ సంస్థ ఇప్పటికే వెల్లడించింది. అంతేకాకుండా 5జీ ఫోన్లను ముందుగా ప్రపంచ మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చే అతి కొద్ది కంపెనీ బ్రాండ్లలో తాము కూడా ఉంటామని ఇప్పటికే రియల్ మీ తెలిపింది. తన మాటను నిలబెట్టుకుంటూ తమ సంస్థ నుంచి మొదటి 5జీ స్మార్ట్ ఫోన్ అయిన రియల్ మీ ఎక్స్50కి సంబంధించిన వివరాలను వెల్లడించింది. షియోమీ అందుబాటులోకి తీసుకురానున్న రెడ్ మీ కే30 తరహాలోనే ఇందులో కూడా కొత్త రకము డ్యూయల్ మోడ్ ఎన్ఎస్ఏ,  ఎస్ఏ 5జీ నెట్ వర్క్ ఫీచర్ లతో మార్కెట్లోకి రాబోతుంది.

 

ఇక  షియోమీ నుంచి వచ్చే రెడ్ మీ కే30 5జీ స్మార్ట్ ఫోన్ డిసెంబర్ లో లాంచ్ అవ్వడానికి సిద్ధం అవుతున్నది. ఎక్స్50 ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందనే అంశంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే రియల్ మీ ఇండియా మాధవ్ సేఠ్ ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశంలో 5జీ ఫోన్లను 2019లోనే లాంచ్ చేస్తామని తెలిపారు. కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు అతి త్వరలో తెలిసే అవకాశం ఉంది అని రియల్ మీ ప్రకటించింది.రియల్ మీ ఎక్స్50 మాదిరిగానే రెడ్ మీ కే30 స్మార్ట్ ఫోన్ లో కూడా ఆధునికమైన డ్యూయల్ పంచ్ హోల్ కెమెరా సెటప్ ను అందించారు.

 

 దీనికి సంబంధించిన వివరాలను రియల్ మీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ క్యూ కీ చేజ్ ట్వీటర్ ద్వారా తెలియచేయడం జరిగింది. ఈ ఫోన్ డ్యూయల్ మోడ్ 5జీ కనెక్టివిటీని సపోర్ట్ చేయనుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ ప్రాసెసర్ పై పనిచేస్తుందా లేదా క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ పై పనిచేస్తుందా అని విషయం ఇంతవరకు తెలియరాలేదు. ఈ రోజులలో రకరకాల ఫోన్లు అందుబాటులో ఉండి ప్రజలను ఆకర్షిస్తున్నాయి. కంపెనీలు మాత్రము ఒక్కొక్క ఫోను విడుదల చేసినప్పుడల్లా కొత్తరకం ఫ్యూచర్ లను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటిస్తాయి. ఈ కొత్తరకం ఫోను వచ్చినప్పుడల్లా యువత ఫోనుమార్చు తుండము తల్లిదండ్రులకు తలనొప్పిగా మారనున్నది.

 

ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో క్వాల్ కాం 5జీ రెడీ స్నాప్ డ్రాగన్ 700 సిరీస్ ప్రాసెసర్లను ప్రకటించింది. అయితే ఈ ప్రాసెసర్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుబాటులోకి రాకపోయినా జనము ఇప్పుడే అందుబాటులోకి వచ్చినట్లు అందరికీ తెలియజేస్తున్నారు కానీ వీటిపై పుకార్లు షికార్లు చేయడం మాత్రం ఆగలేదు. ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు కాకుండా మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలో అందించే మొదటి 5జీ ప్రాసెసర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 735 అవుతుందని టెక్ నిపుణులు వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: