పెన్షన్ డబ్బు కావాలంటే ఈ నవంబర్ 20 లోపు ఒక పని చెయ్యాలి.. లేదంటే పెన్షన్ డబ్బు రావటం కష్టమే.. ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు ఈ నెల చివరికి అంత జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించాలి. ఇలా చేస్తేనే పెన్షన్ ను ఎలాంటి విరామం లేకుండా తీసుకోవచ్చు.. లేదంటే పెన్షన్ ఆగిపోయే అవకాశం ఉంది. 

 

ఇంతకముందు అయితే పెన్షన్ డబ్బు డైరెక్ట్ గా తీసుకునే వారు.. కానీ ఈ జీవన్ ప్రమాణా పత్రాన్ని అందించాల్సి ఉంటుంది. అయితే ఈ సెర్టిఫికెట్ ని ఇప్పుడు ఆన్లైన్ లో కూడా సమర్పించవచ్చు. పింఛన్ తీసుకునే వారు డిజిటిల్ లైఫ్ సర్టిఫికెట్ ను ఎక్కడ పెన్షన్ తీసుకుంటుంన్నారో అక్కడికి వెళ్లి ఇవ్వాలి.. కుదరదు అంటే ఆన్లైన్ లో ఈ పెన్షన్ సర్టిఫికెట్ ని సమర్పించలి.. 

 

అయితే ఈ లైఫ్ సర్టిఫికెట్‌ను నాలుగు మార్గాల్లో తీసుకోవచ్చు.. ఎలా అంటే.. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి డైరెక్ట్‌గానే సర్టిఫికెట్‌ను అందించొచ్చు. ఫామ్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి అక్కడి అధికారులకు అందిస్తే సరిపోతుంది. బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి డిజిటల్ రూపంలో కూడా సర్టిఫికెట్‌ను అందించొచ్చు. ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్, అకౌంట్ నెంబర్, బయోమెట్రిక్స్ వంటి వివరాలు అక్కడి అధికారులకు అందించాల్సి ఉంటుంది. 

 

అయితే ఈ వివరాల సాయంతో జీవన్ ప్రమాణ్ పత్రం జనరేట్ అవుతుంది. ఆలా జనరేట్ అయినా ఐడీని మీకు ఇస్తారు. జీవన్ ప్రమాణ్ పోర్టల్‌కు వెళ్లి ఈ లైఫ్ సర్టిఫికెట్  ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ చేసుకోవచ్చు. బ్యాంక్‌కు వెళ్లకుండానే ఉమాంగ్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లోనే లైఫ్ సర్టిఫికెట్‌ను ఇవ్వచ్చు. అయితే ఆన్లైన్ యాప్ కోసం గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, జీవన్ ప్రమాణ్ అనే ఆప్షన్ ఎంచుకొని జీవన్ ప్రమాణా పత్రని క్రియేట్ చేసుకోవాలి. అంతే ఈ యాప్ తో ఆన్లైన్ నుంచి సర్టిఫికెట్ సమర్పించవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: