మీరు పోస్టాఫీస్లో  అకౌంట్ ఓపెన్  చేయాలి అని అనుకుంటారా...ఐతే మీరు ఈ రూల్స్ కచ్చితంగా  తెలుసుకోవాల్సిందే.. ప్రస్తుతం పోస్టాఫీస్ చాల రకాల సేవింగ్ స్కీమ్స్‌ను ప్రజలకు ఆఫర్ ప్రకటిస్తున్న సంగతి  అందరికి తెలిసిందే కదా. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు  ఇన్వెస్ట్ చేయడం  వల్ల ఆకర్షణీయ వడ్డీ సులభంగా లభిస్తుంది. ఇలా చేయడం వాళ్ళ మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. పోస్టాఫీస్ స్కీమ్స్ కింద అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమమ్ బ్యాలెన్స్ కచ్చితంగా ఉండాలి.

 

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే... పోస్టాఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అకౌంట్ ఓపెన్ చేయాలంటే కనీసం రూ.500 కచ్చితంగా ఉండాలి. ఒక వేళా పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే రూ.500 అవసరం అవుతుంది. ఒక వేళా మీకు  చెక్‌బుక్ కూడా కావాలి అని అనుకుంటే  రూ.500 అవసరం అవుతుంది. ఇలా ఏమి వద్దు అనుకుంటే  ఖాతాదారుడు రూ.50 మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేస్తే సరిపోతుంది.

 

ఇంకా పోస్ట్ ఆఫీస్ అందించే   స్కీమ్స్‌లో  పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అకౌంట్ గురించి వివరాల్లోకి వెళ్తే.. మినిమమ్ బ్యాలెన్స్ రూ.100  ఉండాలి. అలాగే పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (ఫిక్స్‌డ్ డిపాజిట్) అకౌంట్‌కు కూడా రూ.100 మినిమమ్ అమౌంట్ కచ్చితంగా ఉండాలి. ఒక వేళా అదే సమయంలో పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ అకౌంట్‌కు రూ.1,000 మినిమమ్ బ్యాలెన్స్ ఉండే లాగా చూసుకోవాలి.

 

ఇక పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌ సేవలు కూడా ప్రజల ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఈ అకౌంట్ మెచ్యూరిటీ పీరియడ్ విషయానికి వస్తే ఐదేళ్లు. నెలలో ఏ రోజైనా ఆర్‌డీ అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది. కానీ పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌ను ఎప్పుడైనా క్లోజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇంకా సీనియర్ సిటిజన్ కోసం కూడా ఒకటి ఉంది అది ఏమిటి అంటే ..  సీనియర్ సిటిజన్ అకౌంట్‌ కూడా ఏడాది తర్వాతనే క్లోజ్ చేసుకోవడానికి చాల సులభంగా ఉంటుంది. ఇలా అన్ని అకౌంట్ వివరాలు తెలుసుకున్నారు కదా మీకు ఏ అకౌంట్  కావాలో దగ్గరున్న బ్రాంచ్ ఆఫీస్ ని సంప్రదించి అకౌంట్ ను ఓపెన్ చేసుకోగలరు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: