రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబాని ప్రపంచ చమురు రంగంలో పాగా వేయాలనుకుంటున్నారు దీంతో అందరికి  ముఖేష్‌ అంబానికి షాక్‌ తగలనుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనరీ, పెట్రో కెమికల్‌ వ్యాపారంలో దాదాపు 100 లో 25 శాతం వాటా కొనుగోలు చేయాలని భావించిన ప్రపంచంలోనే అతి పెద్ద చమురు సంస్థ, సౌదీ ఆరామ్‌కోకు భారత ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. రిలయన్స్‌ వ్యాపారంలోని 25 శాతం వాటాను ఆరామ్‌కో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపినట్లు ఇటీవల పలు రకాలుగా  వార్తలు వచ్చిన నేపథ్యంలో దాన్ని వెంటనే మన భారత ప్రభుత్వం అడ్డుకున్నట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలో భారీగా  వార్తను ప్రచురించింది. 

 

కాగా  భారత ప్రభుత్వం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బ్రిటిష్‌ గ్యాస్‌పై కొనసాగుతున్న కోర్టు కేసులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంకా ఆ కేసు విచారణ జరుగుతుందని  ఇటీవల ఆ పత్రిక వెల్లడించింది.అంతేకాకుండా  భారత  ప్రభుత్వం తమ కంపెనీ ఆస్తులను వెల్లడిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని రిలయన్స్ డైరెక్టర్లను కోరిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణ జరగలేదు కానీ దీని కొరకు ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 6న విచారణ చేపట్టనున్నట్టు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక  పేర్కొంది.

 

గతంలోనే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనరీ, పెట్రో కెమికల్స్‌ వ్యాపారంలో మైనారిటీ (25 శాతం)వాటా కోసం సౌదీ ఆరామ్‌కో కంపెనీ 1,000–1,500 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నదని ఆసక్తి కరమైన విషయంపై కూడా  వార్తలు వచ్చాయి.

కానీ ఇన్ని విధాలుగా వార్తలు వస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  ఈ వార్తలపై స్పందించడానికి  నిరాకరించింది. ఇక ఎందుకు స్పందించడం లేదని మీడియా అడగటంతో  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  మార్కెట్‌ ఊహాగానాలపై స్పందించడం తమ విధానం కాదని పేర్కొంది. ప్రభుత్వం నిర్ణయంపై రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: