ప్రపంచంలో అతిపెద్ద సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అయిన ఫేస్బుక్ తాజాగా ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోలో వాటాలను కొనుగోలు చేసింది. అవి అంతా ఇంతా కాదండోయ్ ఏకంగా 43, 574 కోట్లు ఇన్వెస్ట్ మెంట్ లతో జియో లో ఏకంగా 9.9 శాతం వాటాను ఫేస్బుక్ చేజిక్కించుకుంది. ప్రస్తుతం దేశీయ టెలికాం రంగంలో అతి పెద్ద ఎఫ్.డి.ఐ డీల్ ఇదే అవ్వడం నిజంగా విశేషమే. అలాగే మైనారిటీ వాటా కింద ఒక కంపెనీ ఇంత పెద్ద స్థాయిలో చేయడం కూడా ప్రపంచంలో ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. అయితే తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీ వీటి వివరాలను పూర్తిగా వెల్లడించింది.

 

 

అయితే ఫేస్బుక్ తాజా ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదన చూస్తే రిలయన్స్ జియో మొత్తం విలువ రూ. 4.62 లక్షల కోట్లుగా ఉంది. ఈ దెబ్బతో దేశంలో టాప్ 5 అతిపెద్ద మార్కెట్ కలిగిన కంపెనీల లిస్టులో జియో చేరింది. దేశవ్యాప్తంగా స్మాల్ బిజినెస్ లో ఎక్కువ అవకాశాలు అందుబాటులో ఉంచేందుకు ఈ డీల్ కుదిరినట్లు రిలయన్స్ జియో తెలిపింది. దీనితో దేశంలో 130 కోట్ల మందికి కొత్త డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని పేర్కొంది. ఇది ఒకటే కాకుండా జియో ప్లాట్ ఫార్మ్స్, రిలయన్స్ రిటైల్, వాట్సాప్ మధ్య కూడా ఒక ఊహాత్మక భాగస్వామ్యం కుదిరింది. ఈ దెబ్బతో వాట్సాప్ వినియోగం ద్వారా జియో మార్ట్ ప్లాట్ఫామ్ పై రిలయన్స్ రిటైల్ న్యూ కామర్స్ వ్యాపారాన్ని విస్తరింపబోతున్నారు.

 


అయితే రిలయన్స్ రిటైల్ కు సంబంధించిన జియో మాటను ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ ఫ్లిప్ కార్ట్ లకు పోటీగా తయారుచేయాలని రిలయన్స్ తన ఊహాత్మక రచన చేసింది. కొన్ని వేల సంఖ్యలోని చిరువ్యాపారులను, కిరాణం షాపులను ఏకం చేసి ఒకే ఫ్లాట్ ఫామ్ పైకి తీసుకు వచ్చి దానితో దిగ్గజ రంగాలకు చెక్ పెట్టాలని ముకేష్ అంబాని ఆలోచిస్తున్నారు. ఇకపోతే ఈ డీల్ ద్వారా వచ్చిన డబ్బుతో రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణ భారాన్ని కాస్త తగ్గించుకోనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: