మోదీ ప్రభుత్వం ఆడపిల్ల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అదేనండి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్. మీ అమ్మాయి చదువు, పెళ్లి కోసం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌లో డబ్బులు దాచుకుంటున్నారా ? అయితే ఈ పథకాల రూల్స్ మారాయి. కొత్త నిబంధనల ప్రకారం.. సుకన్య అకౌంట్ కలిగిన వారు చనిపోయినా లేదంటే వీరి సంరక్షకులు మరణించినా లేదంటే అకౌంట్‌దారులకు ప్రాణాంతకరమైన వ్యాధి ట్రీట్‌మెంట్ కోసం సుకన్య అకౌంట్‌ ను ముందుగానే క్లోజ్ చేసుకోవచ్చునని తెలిపారు. 

 

 

కొత్తగా నోటిఫై చేసిన నిబంధనల ప్రకారం.. అమ్మాయికి 18 ఏళ్ల వచ్చే వరకు అకౌంట్‌ ను సొంతంగా నిర్వహించుకునే అవకాశం ఉండదన్నారు. సుకన్య సమృద్ధి అకౌంట్ దారులకు 18 ఏళ్లు వచ్చే వరకు ఆ ఖాతా నిర్వహణను సంరక్షకులే చూసుకుంటారని తెలిపారు. సుకన్య సమృద్ధి అకౌంట్‌‌ ను బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి ఓపెన్ చేయొచ్చునని తెలిపారు.

 

 

ఒక ఇంట్లో 10 ఏళ్లలోపు వయసు ఉన్న ఇద్దరు అమ్మాయిల పేర్లపై అకౌంట్‌ ను తెరవొచ్చునన్నారు. కొన్ని సందర్భాల్లో ఒక ఇంట్లో రెండు కన్నా ఎక్కువ సుకన్య సమృద్ధి అకౌంట్లను ప్రారంభించొచ్చునని తెలిపారు. దీని కోసం గతంలో గార్డియన్ మెడికల్ సర్టిఫికెట్ అందించాల్సి ఉండేదన్నారు. అయితే ఇప్పుడు అఫిడవిట్ ఇస్తే చాలు అని తెలిపారు. కవలలు పుట్టినప్పుడు రెండు కన్నా ఎక్కువ సుకన్య సమృద్ధి అకౌంట్లను తెరుచుకోవడానికి అవకాశాన్ని కల్పించారు.

 

 

అంతే కాకుండా గతంలో సుకన్య సమృద్ధి అకౌంట్ ‌లో వడ్డీ మొత్తం పొరపాటున క్రెడిట్ అయితే దాన్ని వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉండేది. అయితే ఇప్పుడు డిఫాల్ట్ అకౌంట్లకు కూడా స్కీమ్ వడ్డీ రేటే వర్తిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రూల్స్‌ను తొలగించారు. ఇంకా స్కీమ్‌పై వచ్చే వడ్డీ మొత్తాన్ని సుకన్య సమృద్ధి అకౌంట్‌కు ఆర్థిక సంవత్సరం చివరిలో జమ చేస్తారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: