వరుణుడు కనికరించడం లేదు,వర్షపు జల్లులు కురిపించడం లేదు.లోకం పై పగబట్టాడో ఏమో,శృతి లయతప్పినట్ట్లు,ప్రకృతి గతి తప్పింది.అందుకే అతివృష్టి ఓ చోట,అనావృష్టి ఓ చోట,ధరణి పైన కరువు చేసే విలయతాండవం ఇది.దీనివల్ల రైతులకు తప్పడం లేడు నష్టం,కష్టం...కాని ఇటువంటి కరువు సీజన్‌లో కూడ పంటతో పంటగ చేసుకుంటున్నాడు ఓ రైతు.అదెలా సాధ్యమో,ఇంతకు అతను పండించే పంట ఏంటో తెలుసుకుందాం.



అనంతపూర్ లోని తనకల్లు మండలం,చిన్నరామన్నగారిపల్లికి చెందిన యువరైతు జయదేవరెడ్డి బోరు బావి కింద 30 సెంట్లలో కనకాంబరం సాగు చేశాడు. ఆరు రోజులకు ఒకసారి కోత కోస్తూ ఇప్పటికే రెండేళ్లుగా పంట దిగుబడి తీసుకుంటున్నాడు. 30 సెంట్లలో ఒకటిన్నర సంవత్సరంలో రూ.మూడున్నర లక్షల వరకు ఆదాయం వచ్చిందని రైతు ఆనందంగా తెలిపాడు. అంతే కాక పూలు కోయడానికి కిలో రూ.50 చెల్లిస్తుండటంతో పలువురు మహిళలకు కూడా ఉపాధి చూపుతున్నాడు. కరువు సీమలో రైతుల పాలిట కనకం కురిపించే పంటగా కనకాంబరం ప్రసిద్ధి చెందింది.



ఇలాంటి కరువు పరిస్థితుల్లో కూడా జిల్లాలోని అన్నదాతలు మనో నిబ్బరంతో వ్యవసాయాన్ని వీడలేదు.బోరు బావుల్లో వస్తున్న అరకొర నీటితోనే పూల తోటలకు ప్రాణం పోస్తున్నారు.అవే రైతు కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాయి.కనకాంబరం సాగు చేసిన రైతులకు కనకం కురిపిస్తున్నాయి.ఆరు రోజులకు ఒకసారి కోతకు వచ్చే కనకాంబరాలు ఏడాది పొడవునా దిగుబడి వస్తోంది. పండుగలు,వ్రతాలు,దేవర్లు,పూజలు,ప్రత్యేక శుభదినాల్లో కనకాంబరం కిలో రూ.1500 వరకు ధర పలుకుతోంది. సరాసరి ఏడాది పొడవునా రూ.500లకు తగ్గకుండా ధర వస్తుండటంతో కనకాంబరం సాగు చేసిన రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.ఇక ఈ పంట సాగుకు ఖర్చు తక్కువ కాగా,పురుగు మందుల బెడద ఉండదని తెలిపారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: