మొబైల్ రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించి వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్నది నోకియా ఫోన్లు అని ఎవ్వరైనా చెబుతారు.  తాజాగా మొబైల్ మార్కెట్‌లోకి లేటెస్ట్ ఫీచర్లతో రీ ఎంట్రీ ఇచ్చిన నోకియా ఇప్పటికే కొన్ని స్మార్ట్‌పోన్లతోపాటు ఫీచర్‌ ఫోన్లను కూడా లాంచ్‌ చేసింది.  ముఖ్యంగా నోకియా 6 ఇప్పటికే 10లక్షలను మించిన  రిజిస్ట్రేషన్లను సొంతం చేసుకుంది.   అమెజాన్‌ లో  నోకియా 6  ఒక మిలియన్‌ పైగా  రిజిస్ట్రేషన్లను పొందిందని  అమెజాన్‌ ప్రకటించింది.
వొడాఫోన్ యూజర్లకు 45జీబి 4జీ డేటా..
ఆగష్టు 23న అమెజాన్ ఇండియాలో జరిగే నోకియా 6 మొదటి ఫ్లాష్ సేల్ కోసం ఇప్పటికే 10 లక్షల మంది యూజర్లు రిజిస్టర్ అయిననట్లు సమాచారం. సేల్ తేదీ దగ్గర పడేలోపు ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. జూలై 14 నుంచి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభమయ్యింది. అయితే మొదటి సేల్‌లో ఎన్ని నోకియా 6 యూనిట్లను అందుబాటులో ఉంచుతారన్నది తెలియాల్సి ఉంది.
అనేక విధాలుగు టెస్ట్ చేసారు..
నోకియా 6 తోపాటు నోకియా 5, 3  స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. నోకియా 6 కోసం జూలై 14 న  కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా  ఆగష్టు 23 నుంచి రూ.14,999 ధరలో కొనుగోలుకు  ఇది అందుబాటులోఉంది. నోకియా 6ను ముందుగా సొంతం చేసుకునే అమెజాన్ ప్రైమ్ యూజర్లకు క్యాష్ బ్యాక్ క్రింద రూ.1000 లభిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ వారివారి అమెజాన్ పే బ్యాలన్స్ అకౌంట్‌లలో యాడ్ అయిపోతుంది. 


ఇక నోకియా  6 ఫీచర్స్ : 

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే,
గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,ఆండ్రాయిడ్ 7.1 నూగట్
ఆక్టాకోర్ ప్రాసెసర్
3 జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
షహైబ్రిడ్ డ్యుయల్ సిమ్
16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
4జీ వీవోఎల్‌టీఈ
3000 ఎంఏహెచ్ బ్యాటరీ.


మరింత సమాచారం తెలుసుకోండి: