స్టాక్ మార్కెట్లు లాభాలతో  ప్రారంభమైనాయి. చివరి గంటల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు ఆస‌క్తి చూపడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో ఈ రోజు స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. 281 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ 33,033 వద్ద ముగియ‌గా, నిఫ్టీ 97 పాయింట్లు కోల్పోయి 10,225 వద్ద ముగిసింది. ఈ రోజు ఆరంభం నుంచి సూచీలు ఒత్తిడికి గురయ్యాయ‌ని విశ్లేష‌కులు పేర్కొన్నారు.

సన్‌ఫార్మా, యూపీఎల్‌ లిమిటెడ్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం టీసీఎస్‌, మహింద్రా అండ్‌ మహింద్రా షేర్లు లాభపడ్డాయి. కోల్‌ఇండియా, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, అదానీ పోర్ట్స్‌, అరబిందో ఫార్మా, త‌దిత‌ర షేర్లు న‌ష్టపోయాయి. 

ఐటీ,  స్మాల్‌కాప్స్‌​  బాగా లాభపడుతున్నాయి.  యాక్సిస్‌, ఎస్‌బీఐ, కరూర్‌ వైశ్యా ,హెచ్‌యూఎల్‌,  ఐటీసీ,  గోద్రెజ్‌, జ్యోతి లాబ్స్‌,  నెస్లే షేర్లలో  జీఎస్‌టీ రిలీఫ్‌ కనిపిస్తోంది.  ఎంఅండ్‌ఎం,ఐషర్‌ లాభాల్లోనూ,  ఓఎన్‌జీసీ, ఎల్‌అంఢ్‌టీ, కోల్‌ ఇండియా, ఐవోసీ, ఐబీ హౌసింగ్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, టాటా స్టాల్‌, భారతీ నష్టపోతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: