దేశీయ స్టాక్ మార్కెట్లు బుధ‌వారం న‌ష్టాల‌తో ముగిశాయి. సెన్సెక్స్‌ 59 పాయింట్లు నష్టపోయి 33777 వద్ద ముగిసింది. నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 10444 వద్ద ముగిసింది. నాలుగు రోజుల ర్యాలీ తరువాత మార్కెట్లు నేటి ట్రేడింగ్‌లో కన్సాలిడేషన్‌ బాటలో నడిచాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా వచ్చిన సంకేతాలు కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. రిలయన్స్‌ ఇన్‌ఫ్రాక్ట్ర్చర్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్ పవర్‌ 7-12 శాతం లాభపడ్డాయి.

అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసల నష్టంలో 64.09గా నమోదైంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు 84 రూపాయల నష్టంలో రూ.28,489గా ఉన్నాయి.  నిఫ్టీ తన 10,450 మార్కును నిలబెట్టుకోలేకపోయింది. అయితే నేటి ట్రేడింగ్‌లో రిలయన్స్‌ గ్రూప్‌ షేర్లు దూసుకెళ్లాయి. ముఖ్యంగా రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ 45 శాతం వరకు లాభాల పంట పండించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: