దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఫ్లాట్‌గా ఎంట్రీ ఇచ్చిన నిమిషంలోనే దేశీయ సూచీలు లాభాల్లోకి ఎగిశాయి. నిఫ్టీ 11,050 మార్కు పైన, నిఫ్టీ 36,500 మార్కు పైన ట్రేడవుతున్నాయి. 15 పాయింట్ల నష్టంలో ప్రారంభమైన సెన్సెక్స్‌, ప్రస్తుతం 121 పాయింట్ల లాభంలో 36,663 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా ఫ్లాట్‌ ట్రేడింగ్‌ నుంచి 32 పాయింట్ల లాభంలోకి పయనించింది.  అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం, పలు వస్తువులపై భారత ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది.


దీనికి తోడు సెప్టెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 218 పాయింట్లు నష్టపోయి 36,324కు పడిపోయింది. నిఫ్టీ 76 పాయింట్లు పతనమై 10,977కు చేరింది.  ట్రేడింగ్‌ ప్రారంభంలో బ్యాంకింగ్ రంగం నష్టపోగా.. ఐటీ, ఫార్మాస్యూటికల్స్‌ లాభాలు పండించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ పడిపోయింది. రూపాయి క్షీణతకు అడ్డుకట్ట వేసేందుకు, కరెంట్‌ అకౌంట్‌ ఖాతా లోటును తగ్గించేందుకు బుధవారం పలు వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్టు కేంద్ర ప్రకటించడానికి అనుగుణంగా ఇన్వెస్టర్లు స్పందిస్తున్నట్టు తెలిసింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ప్రిస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ (9.00), హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ (6.44), వక్రాంగీ (4.99), ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ (4.76), నీల్ కమల్ లిమిటెడ్ (4.20).


టాప్ లూజర్స్:
ఎస్ఆర్ఈఐ ఇన్ఫ్రా (17.00), ఇండియాబుల్స్ రియలెస్టేట్ (10.36), ఎడిల్ వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (10.35), యస్ బ్యాంక్ (9.14),  క్యాన్ ఫిన్ హోమ్స్ (8.48).






మరింత సమాచారం తెలుసుకోండి: