దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 142 పాయింట్లు లాభపడి 35,898వద్ద, నిఫ్టీ 54 పాయింట్లు లాభపడి 10,789 వద్ద ముగిశాయి. నేడు నిఫ్టీ లోహరంగ షేర్ల సూచీ 1.13శాతం లాభాల్లో ముగిసింది. వెలస్పన్‌ కార్ప్‌ షేర్లు, అపోలో ట్యూబ్స్‌ షేర్లు భారీగా లాభపడ్డాయి.  భార‌త్ వ‌చ్చేద‌శాబ్దంలో కూడా వేగ‌వంతంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా, చైనాను మించి వృద్ధి న‌మోదు చేస్తుంద‌ని ఒక ప్రైవేటు నివేదిక తెల‌ప‌డంతో మార్కెట్ సెంటిమెంట్ బ‌ల‌ప‌డింది.


ప్రారంభంలో నష్టాల్లో కొనసాగినప్పటికీ... ఆ తర్వాత లాభాల బాట పట్టాయి.  టెక్‌ మహీంద్రా షేర్లు 3.5శాతం లాభపడ్డాయి. ఈ కంపెనీ బైబ్యాక్‌ను గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో  టెక్‌ మహీంద్రా షేర్లు  లాభపడ్డాయి . ఆసియా మార్కెట్లు మిశ్ర‌మంగా ముగిశాయి. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.71.18 వ‌ద్ద కొన‌సాగుతోంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (2.94%), వేదాంత లిమిటెడ్ (2.78%), ఓఎన్జీసీ (2.05%), బజాజ్ ఫైనాన్స్ (2.01%), సన్ ఫార్మా (1.79%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-1.33%), ఇన్ఫోసిస్ (-0.91%), మారుతి సుజుకి (-0.76%), కోల్ ఇండియా (-0.74%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.62%).     



మరింత సమాచారం తెలుసుకోండి: