ఈ మద్య కాలంలో ప్రతి వస్తువు ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే..మన ఇంటికే వస్తున్నాయి.  వాడుకునే వస్తువుల నుంచి తినే అన్ని పదార్థాలు ఆన్ లైన్ లో బుక్ చేస్తే ఇంటికి వచ్చేస్తున్నాయి. తాజాగా ఇప్పుడు విజయా డెయిరీ ఆన్ లైన్ లోకి వచ్చేసింది. పాల ఉత్పత్తులను ఆన్ లైన్ లో అమ్మకానికి పెడుతోంది. బిగ్ బాస్కెట్ , డెయిలీడాట్ కామ్ , సూపర్ డెయిలీ, ఫ్లిప్ కార్ట్​, అమెజాన్ నౌ వంటి ఆన్ లైన్ స్టోర్లలో వాటిని అందించేందుకు నిర్ణయించింది.

పాలు, నెయ్యి, ఫ్లేవర్డ్​ మిల్క్​, దూద్ పేడ.. వంటి విజయ ఉత్పత్తులను ఆన్ లైన్ లో అందుబాటులోకి తెస్తున్నట్టు పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా చెప్పారు.ర్చి మొదటి వారం నుంచి అమెజాన్ నౌలో పాల ఉత్పత్తులన్నీ అందుబాటులో ఉంటాయి.

మజ్జిగ, లస్సీ, దూద్ పేడ వంటి వాటిని సరఫరా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. కాకపోతే పాలు కావాలంటే మాత్రం ఓ రోజు ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటదని డెయిరీ అధికారులు చెబుతున్నారు. ఫ్లిప్ కార్ట్​లో ప్రస్తుతం విజయ నెయ్యి మాత్రమే లభిస్తోంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: