దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు,  భారత ప్రభుత‍్వం సర్జికల్‌ స్ట్రైక్‌ వార్తలతో ఇన్వెస్టర్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. పాకిస్థాన్ భూభాగంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేయడం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన తరుణంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. సెన్సెక్స్‌ 350 పాయింట్లకు పైగా నష్టపోయింది.నిఫ్టీ కూడా 90 పాయింట్లు పతనమైంది.


అయితే వెంటనే కోలుకొని నష్టాలను246 పాయింట్లకు తగ్గించుకున్న సెన్సెక్స్‌ ప్రస్తుతం 35,952వద్ద ఉంది. నిఫ్టీ 76 పాయింట్లు క్షీణించి 10801 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని సెక్టార్లు నష్టపోతున్నాయి. హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు నష్టపోయాయి.


టాటా మోటార్స్, కోల్ ఇండియా, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో తదితర కంపెనీలు టాప్ గెయినర్లుగా ఉన్నాయి.అటు దేశీయ కరెన్సీ డాలరు మారకంలో   రూపాయి ఆరంభంలో 40పైసలు నష్టపోయింది. వెంటనే తేరుకుని 30పైసల నష్టంతో 71.31వద్ద కొనసాగుతోంది.  సరిహద్దులో కొనసాగే ఉద్రిక్తతలు మార్కెట్లపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. బోర్డర్ లో ఏం జరగనుందో వేచి చూడాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: