ఈ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు... కేబినెట్ కూర్పు తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఒడిదుడుకుల్లో కొనసాగుతూ చివరకు కాస్త కోలుకున్నప్పటికీ... చివరకు నష్టాలు తప్పలేదు. ప్రారంభంలో 200 పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్ చారిత్రాత్మక 40వేల మార్కును కూడా అధిగమించింది. 


కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం, కొత్త మంత్రివర్గం కొలువు దీరడంతో దేశీయ స్టాక్ మార్కెట్‌ మంచి జోష్‌తో కొనసాగుతోంది. ఈ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు... కేబినెట్ కూర్పు తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం నుంచి హెచ్చుతగ్గుల మద్య చివరకు నష్టాలే చవిచూసింది.  ప్రారంభంలో 200 పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్ చారిత్రాత్మక 40వేల మార్కును కూడా అధిగమించింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 117 పాయింట్లు పతనమై 39,714కి పడిపోయింది. 


ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 117 పాయింట్లు పతనమై 39,714కి పడిపోయింది. నిఫ్టీ 23 పాయింట్లు కోల్పోయి 11,922 వద్ద స్థిరపడింది.బీఎస్ఈ సెన్సెక్స్

టాప్ గెయినర్స్:ఏసియన్ పెయింట్స్ (2.43%), టీసీఎస్ (2.40%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.52%), ఓఎన్జీసీ (1.30%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.16%).టాప్

లూజర్స్:యస్ బ్యాంక్ (-4.27%), ఐటీసీ (-3.61%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.17%), వేదాంత లిమిటెడ్ (-2.01%), టాటా మోటార్స్ (-1.46%).



మరింత సమాచారం తెలుసుకోండి: