కూడు, గుడ్డ, గూడు.. ఈ  మూడు ప్రతి మనిషికి చాలా అవసరం.  ఈ మూడింటిలో ఏ ఏది లేకున్నా మనిషి ఇబ్బందులు పడతాడు.  ఈ మూడింటి కోసమే మనిషి బ్రతుకుతుంటాడు.  గ్రామాల్లో నివసించే వ్యక్తులకు ఇల్లు ఉండే ఉంటుంది.  మాములు ఇల్లు లేకపోయినా పూరి గుడిసె అయినా నిర్మించుకొని అందులో ఉంటారు.  


పట్టణంలో ఇల్లు కొనాలి అంటే చాలా ఖర్చు ఎక్కువ.  కనీసం 20 నుంచి 30 లక్షల వరకు ఉంటుంది.  అదే సిటీల్లో.. మహానగరాల్లో కొనాలి అంటే కనీసం 60 లక్షల పైనే పెట్టాలి.  ఇంతడబ్బు పెట్టి ఇల్లు కొనాలి అంటే మాములు విషయం కాదు.  చాలా కష్టం.  అందుకే అద్దె ఇళ్లలోనే ఉండేందుకు ఇష్టపడతారు.  


ఇంటి ధర సరే.. అదే ఒక గొర్రెను కొనాలి అంటే ఎంత అవుతుంది ఎంత మహా అయితే 5 లేదంటే 10వేలు ఖర్చు అవుతుందని అంటారు.  అంతకంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుందట.  అదెలా అనుకుంటున్నారా .. అదే మరి.  రాజస్థాన్ లోని అల్వాల్ జిల్లాలోని ఓ కుటుంబం ఓ గొర్రెను పెంచుకుంటోంది.  


ఈ గొర్రె ధర ఎంతో తెలిస్తే తప్పకుండా హార్ట్ ఎటాక్ వస్తుంది. గొర్రె ధర అక్షరాలా 90 లక్షలు అంట.  అంత ధర అదేమన్నా బంగారమా అనుకుంటే పొరపాటే.. దానికోసం రోజు పావుకిలో బాదం, జీడిపప్పు ఆహారంగా పెడతారట.  పాలు, శనగలను ఆహారంగా తీసుకుంటుంది.  ఇంతగా పోషిస్తున్నారు కాబట్టి దానికి ఆ మాత్రం ధర ఉంటుంది అంటున్నారు.  మరి దీన్ని ఎవరైనా కొనుగోలు చేస్తారా... ఏమో చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: