రూ.32,999 విలువైన వన్‌ప్లస్ 7 స్మార్ట్‌ఫోన్ రూ.29,999 ధరకే కొనొచ్చు.  స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్స్.... ఇంకా  రెడ్‌మీ 7ఏ, సాంసంగ్ గెలాక్సీ ఎం30 మోడల్స్‌పై భారీ డిస్కౌంట్ కావాలా?
ఇ-కామర్స్ కంపెనీలు వచ్చే పండుగ సీజన్‌ను  క్యాష్ చేసుకునేందుకు పోటీపడుతున్నాయి.  దసరా బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగియగానే బిగ్ దివాళీ సేల్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. 

ఇప్పుడు అమెజాన్‌లో దసరా సేల్ ఇలా ముగిసిందో లేదో అప్పుడే దీపావళి సేల్ సందడి మొదలైంది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ జరిగిన సంగతి తెలిసిందే. 
ఇప్పుడు 'సెలబ్రేషన్ స్పెషల్' పేరుతో మరోసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను ప్రకటించింది అమెజాన్. అక్టోబర్ 13న ఈ సేల్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 17న ముగుస్తుంది. 
అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు అక్టోబర్ 12న మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొదలవుతుంది. 


గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ప్రకటించినట్టుగానే ఈ సేల్‌లో కూడా భారీ ఆఫర్లను అందిస్తోంది అమెజాన్.స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది అమెజాన్. నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్, ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ లాంటి ఆకర్షణీయమైన డీల్స్ ఉన్నాయి. రెడ్‌మీ 7ఏ, సాంసంగ్ గెలాక్సీ ఎం30 మోడల్స్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక అమెజాన్ సొంత ప్రొడక్ట్స్ అయిన ఫైర్ టీవీ స్టిక్, ఫైర్ టీవీ స్టిక్ 4కే, కిండిల్ లాంటి వాటిపైనా భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. 


ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్స్‌తో షాపింగ్ చేసేవారు అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. దాంతోపాటు బోనస్ ఆఫర్ కూడా లభిస్తుంది. డెబిట్ కార్డులపై నోకాస్ట్ ఈఎంఐ సౌలభ్యం ఉంటుంది. 
రూ.1 లక్ష వరకు నోకాస్ట్ ఈఎంఐతో షాపింగ్ చేయొచ్చు. బజాజ్ ఫిన్ సర్వ్ కార్డులపైనా నోకాస్ట్ ఈఎంఐ వర్తిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: