కావలసిన పధార్థాలు  ఫిష్: ½kg ఉల్లిపాయలు: 2(సన్నగా కట్ చేసుకోవాలి) ధనియాలు: 2tbsp ఎండు మిర్చి: 9/10 కొబ్బరి తురుము: 2 cups అల్లం: చిన్న ముక్క చింత గుజ్జు: 2tbsp పచ్చిమిర్చి: 5-6(మధ్యకు కట్ చేసుకోవాలి) కొబ్బరి పాలు: 1/2 cup(పచ్చికొబ్బరిని తురిమి గ్రైడ్ చేసి అందులో నీరు పోసి వడగట్టుకోవాలి) నూనె: 2tbsp గరం మసాలా: 1tbsp పసుపు: చిటికెడు ఉప్పు: రుచికి సరిపడా


తయారు చేయు విధానం: ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి. ఇప్పుడు అందులో ఎండు మిర్చి మరియు ధనియాలు వేసి లైట్ గా వేయించుకోవాలి.  తర్వాత ఒక కప్పు నీటిని వేడి చేసి అందులో చింత పండు వేసి ఐదు నిముషాలు నానబెట్టి తర్వాత చేత్తో బాగా కలిపి గుజ్జు తయారు చేసి పక్కన పెట్టుకోవాలి.


 ఇప్పుడు వేయించి పెట్టుకొన్న ఎండు మిర్చి, ధనియాలు, కొబ్బరి పాలు, చింత గుజ్జు, అల్లం వేసి మెత్తగా గ్రైడ్ చేసుకోవాలి.   తర్వాత పాన్ లో నూనె వేసి ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత పేస్ట్ చేసి పెట్టుకొన్ని మసాల ముద్దను వేసి ఫ్రై చేయాలి.  అందులోని పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి ఫ్రై చేయాలి. తర్వాత రెండు కప్పుల నీళ్ళు పోసి బాగా ఉడికించాలి.  గ్రేవి బాగా ఉడికి చిక్కబడే సమయంలో చేప ముక్కలను వేసి ఐదు నుండి పది నిముషాల మాత్రమే ఉడికించుకోవాలి. అంతే మంగళూర్ ఫిష్ కర్రీ రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: