వరల్డ్ కప్ లో ఈరోజు మొదటి సెమిస్ జరగబోతున్నది.  ఈ సెమిస్ లో ఎవరు గెలుస్తారు అనేదానిపై అందరి కళ్ళు ఉన్నాయి.  ఇప్పటి వరకు న్యూజిలాండ్ ఒక్కసారి కూడా కప్ గెలవలేదు.  ఎలాగైనా సెమిల్ లో గెలిచి ఫస్ట్ టైం కప్ గెలవాలనే కసితో ఉన్నది.  ఈరోజు గెలిచి మూడోసారి కప్ ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఇండియా బరిలోకి దిగుతున్నది.  


ఇండియాకు ప్రధాన బలం బ్యాటింగ్.  శ్రీలంక జరిగిన మ్యాచ్ లో ఇండియా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.  శ్రీలంక పై రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ లు సెంచరీలు చేశారు.  కోహ్లీ కూడా రాణించడంతో విజయం సొంతం అయ్యింది.  రాహుల్, రోహిత్, కోహ్లీ, ధోనిలు మంచి ఫామ్ లో ఉన్నారు.  సెకండ్ డౌన్ లో వస్తున్న హార్దిక్ పాండ్య కూడా మంచి లైనప్ లో ఉండటం విశేషం.  


బౌలింగ్ విషయానికి వస్తే.. బుమ్రా, షమీలు, హార్దిక్ పాండ్యాలు బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నారు.  అలాగే జాదవ్, కుల్దీప్ యాదవ్, చాహల్ లు తమ స్పిన్ తో ఆకట్టుకుంటున్నారు.  ఫైనల్ టీం లో ఎవరు ఏంటి అన్నది మరికొద్ది సేపట్లో తేలిపోతుంది.  


మాంచెస్టర్ లో జరగబోతున్న ఈ సెమిస్ కు వరణుడు అడ్డంకిగా మారే అవకాశం ఉన్నది.  మాంచెస్టర్ మేఘావృతం కావడంతో మ్యాచ్ జరుగుతుందా జరగదా అనే అనుమానం కలుగుతున్నది.  లీగ్ దశలో ఇండియా.. న్యూజిలాండ్ జట్లమధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.  ఈ మ్యాచ్ లో విజేతలను వరణుడు డిసైడ్ చేసేలా ఉన్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: