వరల్డ్ కప్ రూల్స్ మరి విచిత్రంగా మారిపోతున్నాయి.  వివాదాలను కొని తెచ్చుకుంటున్నది.  రీసెంట్ గా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ టై గా ముగిసింది.  దీంతో సూపర్ ఓవర్ పెట్టారు.  ఆ ఓవర్ కూడా టై అయ్యింది.  


అలా టై అయితే, బ్యాటింగ్ ఓవర్ తరువాత బౌలింగ్ ఓవర్ పెట్టి ఎవరు ఎలిస్తే వారు విజేతలుగా ప్రకటిస్తే బాగుండేది.  ఐపీఎల్ లో ఇలానే కదా జరుగుతున్నది.  ఎవరు ఎన్ని వికెట్లు పడగొడితే ఆర్ విజేతలు.  ఇలా చేస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుంది.  అలా కాకుండా సూపర్ ఓవర్లో కూడా టై కావడంతో ఎవరు ఎక్కువ ఫోర్లు కొట్టారో వాళ్ళను విజేతలుగా నిలపడం విడ్డూరంగా ఉంది.  


ఇది ఇప్పుడు వివాదంగా మారింది.  చాలామంది దీనిని వ్యతిరేకిస్తున్నారు.  దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతున్నది.  ఒకవేళ సూపర్ ఓవర్ కూడా టై గా ముగిస్తే నెక్స్ట్ ఏం చేస్తారు అనే దానికి.. ఇరు జట్ల కెప్టెన్ల పదోతరగతి మార్క్ షీట్ లోని మార్కుల ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారని ఐసిసి చెప్తున్నట్టు ట్రోల్ చేస్తున్నారు.  


ఇద్దరు సమ ఉజ్జీలుగా ఉన్నారు.  అలాంటప్పుడు ఇద్దర్ని విజేతలుగా ప్రకటిస్తే ఐసిసి పరువు సోషల్ మీడియా వాళ్లకు చిక్కేది కాదు.  ఐసిసి నిబంధనలు చెత్తగా ఉంటున్నాయని బహిరంగంగా అంటున్నారు.  నిబంధనలు మార్చాలని, కొంతమంది అభిప్రాయపడుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: