కొన్ని బంధాలు ఫెవికాల్ లా స్ట్రాంగ్ గా ఉంటాయి.  విడిపోయేందుకు పెద్దగా ఆసక్తి చూపించవు.  అలాంటి బంధాల్లో ఒకటి విరాట్ కోహ్లీ.. కోచ్ రవిశాస్త్రి బంధం.  రవిశాస్త్రి కోచ్ గా బాధ్యతలు స్వీకరించాక.. విరాట్ ను ప్రోత్సహిస్తూ వస్తున్నాడు.  ఒకరకంగా చెప్పాలి అంటే విరాట్ అంత దూకుడుగా, స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నాడు అంటే దానివెనుక కోచ్ రవిశాస్త్రి హస్తం ఉందని చెప్పాలి.  


టీమ్ లో ప్రతి ఒక్కరు దాదాపుగా అదే విధంగా ఉన్నారు.  కుర్రాళ్లలో జోష్ పెంచేందుకు రవిశాస్త్రి తనదైన శైలిలో వ్యవహరిస్తుంటారు.  ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే రీతిలో వాళ్ళను మోటివేట్ చేస్తుంటారు.  ఇవి టీమ్ ఇండియా విజయాలకు కారణాలు అవుతున్నాయి.  


టీమ్ ఇండియా కేవలం ఉపఖండంలో మాత్రమే విజయాలు సాధిస్తుందనే అపవాదును దూరం చేసుకుంది.  విదేశాల్లో సైతం అక్కడి పరిస్థితులకు అనుగుణంగా అది విజయాలు సాధిస్తోంది.  కాగా, వరల్డ్ కప్ తరువాత కోచ్ పదవీకాలం ముగిసింది.  దీంతో కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.  


క్రికెట్ కోచ్ తాత్కాలిక కమిటికి కోచ్ ను ఎంపిక చేసే బాధ్యతను అప్పగించింది.  కోచ్ పదవికి ఎవరు అర్హులు అన్నది కపిల్ దేవ్ ఆధ్వర్యంలో ఎంపిక జరుగుతుంది.  అయితే, కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం కోచ్ గా రవిశాస్త్రిని కొనసాగించాలని అప్పుడే టీమ్ ఇండియా స్ట్రాంగ్ గా ఉంటుందని అంటున్నారు.  కోచ్ పదవి కోసం గ్యారీ క్రిస్టెన్, టామ్ మూడి, జయవర్ధనేలు దరఖాస్తు చేసుకున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: