ఆడవాళ్ళు చిన్నప్పటి నుంచి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. స్కూల్ కు వెళ్ళే వయసు నుంచి కాలేజ్ వెళ్ళే వయసు వరకు అన్నీ రకాల పరిస్థితు లను ఎదుర్కొంటున్నారు.. బిటెక్ కాలేజీల లో ర్యాగింగ్ పేరు తో అమ్మాయిలను హింసిస్తున్నారు.అలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి..ఇటీవల జరిగిన ఓ కాలేజీ ఘటన వల్ల అమ్మాయి సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..

 

 

 

వివరాల్లో కి వెళితే... ప్రేమ వేధింపులు ఓ యువతి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. టైర్ల షాపు లో పని చేసే యువకుడు నిత్యం వేధింపులకు గురిచేస్తుండటంతో మనస్తాపానికి గురైన బీటెక్‌ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో జరిగింది. అమీర్‌ పేట లోని ఈస్ట్‌ శ్రీనివాస్‌నగర్‌ కాలనీ లోని అనురాగ్‌ అపార్ట్‌మెంట్ ‌లో ఉండే ఆర్టీసీ కండక్టర్‌ ఎం.గోపాల్, లావణ్య దంపతుల కు ముగ్గురు సంతానం. వీరి పెద్ద కూతురు అశ్విని (22) రంగరాజు గోక రాజు ఇంజ నీరింగ్‌ కళాశాల లో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది.

 

 

 

లాక్‌డౌన్ కారణంగా ఆమె సుమారు రెండున్నర నెలలుగా ఇంట్లోనే ఉంటోంది. దీంతో నవీన్ తరుచూ ఫోన్ చేసి ఆమెను విసిగిస్తున్నాడు. అతడి వేధింపులు భరించలేకపోయిన అశ్విని ఆదివారం సాయంత్రం 3.30 గంటల సమయంలో చదువుకుంటానని తల్లికి చెప్పి అపార్ట్‌మెంట్‌ పైకి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత తండ్రికి ఫోన్ చేసి నవీన్ వేధింపుల గురించి చెప్పి ఏడ్చింది.నవీన్ వేధింపులు భరించలేకపోతున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకునేందుకు విషం తాగేశానని అశ్విని తండ్రికి చెప్పింది. దీంతో గోపాల్ వెంటనే అపార్ట్‌మెంట్ పైకి వచ్చి చూడగా కూతురు నోట్లో నుంచి నురగలు కక్కుతూ కనిపించింది. దీంతో ఆయన వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: