డబ్బు అనేది ఈ మద్య కాలంలో జబ్బు లాగా పట్టుకుంది..మనుషులను ఎలా మార్చేసిందని వేరేలా చెప్పనక్కర్లేదు..ఎందుకంటే డబ్బు కోసం ఈ మనుషులు సొంత వాళ్ళను కూడా మరచి దారుణాలకు పాల్పడుతున్నారు ఒకప్పుడు మగవాళ్ళు అలా దారుణాలకు పాల్పడితే ఇపుడు ఏకంగా ఆడవాళ్ళు మోసాలకు నేరాలకు పడగ లెత్తుతున్నారు.. ఓ యువతి నగ్న ఫోటోలు పంపించి డబ్బులు గుంజిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..

 

 

 

వివరాల్లోకి వెళితే..హైదరాబాద్‌లోని బర్కత్‌పురాలో ఓ యువతి బరితెగించింది. న్యూడ్ ఫొటోలు అడ్డుపెట్టుకుని ఆ యువకుడిని దారుణంగా మోసం చేసింది. బర్కత్‌పురాకు చెందిన ఓ వ్యక్తి కి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పోయింది. ఇద్దరి మధ్య ప్రేమ కాస్త పిచ్చిగా ముదిరింది. ఎంతగా అంటే ఇద్దరు న్యూడ్ ఫొటోలతో చాటింగ్ చేసి ఎంజాయ్ చేసే వరకు వెళ్లింది.

 

 

 


ఇలా, ఇద్దరు కేవలం న్యూడ్ ఫోటోలతో మాత్రమే చాటింగ్ చేసుకొనేవారు. ఈ తరుణంలోనే యువతికి ఆ అబ్బాయికి సంబంధించిన బంధువుల కాంటాక్ట్స్ సేకరించింది. అనంతరం ఓ బంధువుకి ఈ అబ్బాయి న్యూడ్ ఫోటోలు పంపింది. ఈ విషయం తెలుసుకున్న అబ్బాయి యువతిని నిలదీశాడు. అయితే ఆ యువతి మాత్రం మిగతా బంధువులందరికీ నీ న్యూడ్ ఫోటోలు పంపకుండా ఉండాలంటే లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించింది.

 

 

 

 

అలా దగ్గరయ్యారు.. కొద్దీ రోజులు బాగానే సాగింది..ఆ తర్వాత అసలు రూపాన్ని బయటపెట్టింది. . 3.5 లక్షలు కొట్టేసింది. అంతేకాకుండా మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయసాగింది. డబ్బులు ఇవ్వకపోతే ఫోటోలన్నీ సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడం మొదలు పెట్టింది. ఇలా కొంతకాలంగా ఆ యువతి వేధింపులు భరించలేక ఆ అబ్బాయి హైదరాబాద్సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో అమ్మడు అసలు రంగు బయటపడింది..అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: