ప్రస్తుతం యువతను కట్టి పడేస్తున్న ఒకే ఒక్క యాప్ టిక్ టాక్ ఎంతటి వాడినేయినా సెలెబ్రెటీగా మార్చేస్తుంది.. ఆ విషయం తెలిసిందే.. అయితే ఈ టిక్ టాక్ వల్ల చాలా మంది క్రూరులుగా మారుతున్నారు. మరికొందరు సెలెబ్రెటీలను విర్రవీగుతున్నారు. అందుకే చాలా మంది పిచ్చి పారకాస్తగా మారుతుంది. ఇలా టిక్ టాక్ ద్వారా ఏర్పడిన పరిచయాలు దారుణానికి దారి తీసున్నాయి. వావి వరుసలు మరిచి మరి వింతగా ప్రవర్తిస్తున్నారు. 

 

 


ఏదొక వీడియో చేయడం.. దానికి వచ్చే లైకులు చూసి మురిసిపోవడం కామన్‌ అయిపోయింది. ఇలాంటి వీడియోలు చేస్తూ కొందరు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయి. ఈ కోవలోనే తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాకు చెందిన ఓ యువకుడు బ్రతికున్న చేపను మింగుతూ టిక్‌టాక్ వీడియో తీస్తూ కాసేపటికే ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.

 

 

 

కృష్ణగిరి జిల్లా హోసూర్‌ పార్వతి నగర్‌కు చెందిన శక్తివేల్‌ కుమారుడు వెట్రివేల్‌(22) భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు(2) ఉన్నారు. వెట్రివేల్‌ బుధవారం ఇద్దరు స్నేహితులతో కలిసి చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. అక్కడే మద్యం సేవించిన వీరంతా ఆ మత్తులో టిక్‌టాక్‌ వీడియోలు చేశారు. ఈ సమయంలోనే వెట్రివేల్ బ్రతికున్ చేపను మింగుతూ వీడియో తీసుకున్నాడు.అయితే బ్రతికున్న చేప కావడంతో అతని గొంతుకు అడ్డుగా పడటంతో శ్వాసనాళంలో అడ్డుపడి గిల గిల కొట్టుకున్నాడు. 

 

 

 


వెంటనే అప్రమత్తమైన స్నేహితులు స్నేహితుడు అతడిని వెంటనే హోసూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసుల అనుమతితో డాక్టర్లు పోస్టుమార్టం చేసి చేపను బయటకు తీశారు. ఈ ఘటనపై హోసూర్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టిక్‌టాక్ వ్యసనానికి భర్త చనిపోవడంతో రెండేళ్ల బిడ్డతో వెట్రివేల్ భార్య ఒంటరిగా మిగిలింది.ప్రస్తుతం ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: