ప్రేమ పేరు తో అమ్మాయిలను వలలో వేసుకుంటున్నారు కొందరు మోసగాళ్లు.. అందమైన అమ్మాయిల ను చూసి వారితో పరిచయం పెంచుకొని మాయ మాటలు చెప్పి ప్రేమ అనే వల వేసి వారి కోరికలు తీరాక మొహం చాటేస్తున్నారు. అమ్మాయిలు మాత్రం దాన్నే నిజమనుకొని నమ్మి మోస పోతున్నారు. వాడి కోరికలను  తీర్చుకున్నాక అడ్రెస్స్ లేకుండా జెండా ఎత్తేస్తున్నారు. అలాంటి ఘటన వెలుగు లోకి వచ్చింది. ఓ మృగాడు ప్రేమ పేరు తో దొంగ పెళ్లి చేసుకొని గర్భవతిని చేసి అబార్షన్ చేయించి  ఉడాయించాడు. 

 

 

ఓ యువతికి వలేసి పెళ్లి చేసుకుని కాపురం పెట్టిన ఓ యువకుడు.. మోజు తీరాక ఆమెను వదిలించుకోవాలని చూస్తున్న ఘటన మెదక్ జిల్లాలో వెలుగుచూసింది. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ పోలీసుల ను ఆశ్రయించింది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం వెంకట్రావు పల్లికి చెందిన యువతిని అదే గ్రామాని కి చెందిన యువకుడు ప్రేమ పేరు తో వెంట పడ్డాడు. ఏడాది క్రితం ఆమెను దొంగ చాటుగా పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో కాపురం పెట్టాడు. ఇటీవల ఆమె గర్భం దాల్చడం తో ఏవో మాత్రలు మింగించి అబార్షన్ చేయించాడు.

 

 

 

అలా కొద్దీ రోజులు గడిచాక కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించాడు. కట్నకానుకలు తీసుకురాక పోతే కాపురం చేయనంటూ వేధింపులకు గురి చేశాడు. దీంతో గ్రామానికి చేరుకున్న యువతి పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టింది. వారి సమక్షంలో ఈ 14న పెళ్లి చేసుకుంటానని యువకుడు హామీ ఇచ్చాడు. అప్పటి నుంచి అతడు తప్పించుకుని తిరుగు తుండటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తన భర్త తో కాపురం చేయించేలా చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: