ప్రేమ అంటూ ఒక యువకుడు అమ్మాయిని వేదిస్తున్నాడు. ఏకాంతంగా గడిపిన వీడియోలు  ఫోటోలు తీసి వాటితో ఒక అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అయితే ఈ ఘటన వివరాల్లోకి వెళితే గుంటూరుకు చెందిన బీటెక్ విద్యార్థినిని ప్రేమ పేరుతో లోబరుచుకుని ఏకాంత సమయంలో తీసిన ఫోటోలను వీడియోలను చూపిస్తూ బెదిరిస్తున్నాడు. ఇటీవలే ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 

 

అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు పోలీసులు దంపతుల కుమారుడు కావడం తో పక్కదారి పట్టింది ఈ కేసు అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇటీవల వచ్చిన వార్తల్లో నగ్న చిత్రాలు తీసిన వరుణ్ ని వాటిని పోర్న్ వెబ్ సైట్ లో పెట్టిన కౌశిక్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. లేటెస్ట్ గా మరో ఏడుగురిని కూడా అరెస్ట్ చేసినట్టు మీడియా లో చూపించారు. అయితే ఈ ఘటన ఇంకా మరచిపోకుండానే మరో ఘటన వెలుగులోకి రావడం జరిగింది.

 

ఇందులో ప్రేమ పేరుతో మోసం చేయడమే గాక ఏకాంతంగా ఉన్న వీడియోలను ఫోటోలను తీసి ప్రియుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఈ విషాదం నరసరావుపేటలో జరిగింది.  బీటెక్ విద్యార్థిని గుంటూరు రూరల్ ఎస్పీకి సోమవారం ఫిర్యాదు చేసింది. అయితే ఫోటోలు వీడియోలు తీసి బయట పెడతానని బెదిరిస్తున్నాడని చెప్పింది. ఆమె ఇప్పటికే రెండు లక్షల నగదు రెండు  రెండు బంగారు గాజులు అతనికి ఇచ్చిందట కానీ ఇంకా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది అయితే అతనికి ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా అండగా ఉన్నారని వాళ్ల నుంచి రక్షణ కావాలని ఎస్పీని వేడుకుంది. నిజంగా ఈ ఘటన బాధాకరం.ఇలా ప్రేమ పేరుతో మొదట కలిసి ఆ తర్వాత మోసాలు చెయ్యడం బ్లాక్ మెయిల్ చెయ్యడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి ఇప్పటి కాలంలో కూడా. 

మరింత సమాచారం తెలుసుకోండి: