విశాఖలో తాజాగా మరో కిడ్నాప్ కలకలం రేపుతోంది. వరుసగా ఇది వైజాగ్ లో మూడో కిడ్నాప్. ఈ కిడ్నాప్ డైరీ రోడ్డులో జరిగింది. గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు అపహరించి తీసుకెళ్లారు. అసలు కిడ్నప్ ఎందుకు చేసాడు? కారణం ఏమిటి? పూర్తి వివరాలు కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. అయితే విశాఖపట్నం లో మరో కిడ్నాప్ కలకలం రేపింది. ఫైనాన్స్ వ్యాపారి కిడ్నాప్ కేసు మరవక ముందే మరో కిడ్నాప్ వైజాగ్ లో సంచలనంగా మారింది.

 

ఈ సంఘటన విశాఖ డైరీ హైవేలో జరిగింది అయితే వ్యక్తి కిడ్నాప్ అయ్యినట్టు  పోలీస్ కంట్రోల్ రూమ్ కి సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు ఈ వార్త పై వేగంగా స్పందించారు. కూర్మన్నపాలెం వద్ద కిడ్నాపర్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే అసలు ఎందుకు కిడ్నాప్ చేసారు అనే విషయానికి వస్తే ఆర్థిక వ్యవహారాలు నేపథ్యంలో కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాప్ చేసిన వాళ్లని అదుపులోకి తీసుకుని  ప్రశ్నిస్తున్నారు పోలీసులు.

 

అయితే గత వారం లో గార్డెన్ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సురేష్ ని కిడ్నాప్ చేయడం జరిగింది. అయితే కిడ్నాప్ చేసిన దుండగులు రూపాయలు ఐదు కోట్లు డిమాండ్ చేశారు ఈ కిడ్నాప్ తర్వాత ద్వారకా నగర్ కు చెందిన ఫైనాన్స్ వ్యాపారి అప్పలరాజుని దుండగులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత హత్యా ప్రయత్నం చేసి నగదు బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యిపోయారు.  అప్పలరాజు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న లలిత జ్యువెలర్స్ ప్రాంతంలో నిలుచుండగా ముగ్గురు కిడ్నాపర్లు వచ్చి ఆటో లో కిడ్నాప్ చేసినట్లు చెప్పాడు అప్పారావు కానీ. సీసీ ఫుటేజీ చూస్తే అతను స్వయంగా ఆటో ఎక్కడని తేలింది అయితే తనకు తెలిసిన వ్యక్తే కిడ్నాప్ చేశాడు అని పోలీసులు తేల్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: