దేశంలో మొట్టమొదటి ప్రైవేటు రైలు 'తేజస్ ఎక్స్‌ప్రెస్' పట్టాలపై పరుగులు తీస్తోంది.కానీ, భారత్‌లో స్వాతంత్ర్యం రాక ముందు నుంచే ఎన్నో ప్రైవేటు రైల్వే కంపెనీలు ఉండేవి.తిర్హుత్ రైల్వే వాటిలో ఒకటి. దానిని దర్భంగా స్టేట్ నుంచి నడిపేవారు.ఉత్తర బీహార్‌లో 1874లో భయంకరమైన కరవు వచ్చినప్పుడు దర్భంగా మహారాజు లక్ష్మీశ్వర్ సింగ్ తిర్హుత్ రైల్వే ప్రారంభించారు.కరువు పీడితుల కోసం సరకులు తీసుకువచ్చిన ఆ మొదటి రైలు 1874 ఏప్రిల్ 17న వాజిత్‌పూర్ (సమస్తిపూర్) నుంచి దర్భంగా వరకూ నడిచింది.దేశంలో మొదటి గూడ్స్ రైలు అదే. దానిలో ధాన్యం తీసుకొచ్చారు. తర్వాత వాజిత్‌పూర్ నుంచి దర్భంగా వరకూ ప్యాసింజర్ రైలు కూడా నడిపారు.


తిర్హుత్ రైల్వే భారత్‌లో రైలు ప్రయాణం మొదలైన రెండు దశాబ్దాల తర్వాత అంటే 1874లో ప్రారంభమైంది.ఉత్తర బీహార్ అంతటా దీని మార్గాలు వ్యాపించి ఉండేవి.దలసింగ్‌రాయ్-సమస్తిపూర్ లైనుతో 1875లో ప్రారంభమైన తిర్హుత్ రైల్వే 1912లో సమస్తిపూర్- ఖగడియా లైను వేసేవరకూ కొనసాగుతూ వచ్చింది.బిహార్‌లోని సోన్‌పూర్ నుంచి అవధ్ (ఉత్తరప్రదేశ్‌ ప్రాంతం) బహ్రయిచ్ వరకూ రైల్వే లైను వేయడానికి 1882 అక్టోబర్ 23న బంగాల్, నార్త్ వెస్టర్న్ రైల్వే ఏర్పాటు చేశారు.తర్వాత 1896లో ప్రభుత్వ రైల్వే, బెంగాల్, నార్త్ వెస్టర్న్ రైల్వే మధ్య జరిగిన ఒక ఒప్పందం ప్రకారం తిర్హుత్ రైల్వే పనులను బెంగాల్, నార్త్ వెస్టర్న్ రైల్వే తమ చేతుల్లోకి తీసుకుంది.


రైళ్లు నడపడం మొదలుపెట్టినపుడు గంగానదిపై వంతెన లేదు. దాంతో యాత్రికులను నదికి ఒక వైపు నుంచి ఇంకో వైపు వెళ్లడానికి స్టీమర్ సేవలను కూడా ప్రారంభించారు.తిర్హుత్ స్టేట్ రైల్వే దగ్గర 1881-82లో నాలుగు స్టీమర్లు ఉండేవి. అందులో రెండు పెడల్ స్టీమర్ రైళ్లు, రెండు క్రూ స్టీమర్లు.ఆ సెలూన్‌లో దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, మదన్ మోహన్ మాలవీయ్ నుంచి అందరూ వెళ్లారు.


ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సెలూన్ ఉపయోగించని ఒకే ఒక్క నేత గాంధీజీ మాత్రమే. ఆయన ఎప్పుడూ మూడో తరగతి బోగీలో ప్రయాణించేవారు.తిర్హుత్ రైల్వే కంపెనీ దగ్గర పెద్ద లైన్, చిన్న లైన్ కోసం మొత్తం రెండు సెలూన్ లేదా ప్యాలెస్ ఆన్ వీల్ రైళ్లు ఉండేవి.సెలూన్ అంటే నాలుగు బోగీలు ఉంటాయి.  ఇలాగే మహారాణికి కూడా రాంబాగ్ అనే సూట్ ఉండేది.ఈ సెలూన్ల వాష్ రూంలో యూరోపియన్ కమోడ్, బాత్ టబ్‌లు కూడా ఉండేవి.


మరింత సమాచారం తెలుసుకోండి: