మనం చేసే పని ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటే ఏది అసాధ్యం కాదు అన్ని సుసాధ్యాలే,మనం ఈ ప్రపంచానికి తెలియాలంటే మనం సాధించిన గొప్ప విజయాలే ఇందుకు దోహద పడతాయి నిత్యం పని మీదే ఆలోచిస్తున్న మనకి ఒక చిన్న ఆలోచన వచ్చిన అది మన జీవితం లో పెను మార్పును తెస్తుంది,అంతేకాక ఆ ఆలోచన ద్వారా అనేక మందికి ఉపాధి కూడా కలుగుతుంది.ఇంతకీ ఆ ఆలోచన ఏంటి ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా అతడే వెంకటాచలం స్థాను సుబ్రమణి మణి ఇతడు స్థాపించిన సంస్థ పేరు జస్ట్ డయల్.


జస్ట్ డయల్ అనేది వెంకటాచలం స్థాను సుబ్రమణి మణి  స్థాపించిన భారతీయ ఆధారిత సంస్థ. ఇది శోధన సేవలను అందిస్తుంది. కంపెనీ ప్రధాన కార్యాలయం భారతదేశంలో మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. అహ్మదాబాద్, బెంగుళూరు, చండీగఢ్, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, కోల్కతా మరియు పూణేలలో కార్యాలయాలు ఉన్నాయి.వీ.స్.స్.మణి  గురించి ఎంత చెప్పిన తక్కువే ఇతను మొదట్లో ఒక చిన్న గ్యారేజీని అద్దెకు తీసుకోని కొన్ని కంప్యూటర్లు అమర్చి  మొదలుపెట్టాడు.ఇది  ఎల్లో పేజెస్ సంస్థకి చెందినది అప్పట్లో 88888  88888 అనే నంబరు ముంబై లోని కాండీవాలి ఎక్స్చేంజి కు సంబంధించింది.కాలక్రమేణా మని ఈ నంబర్ను సొంతం చేసుకున్నారు.


వినియోగదారులు ఒక హాట్ లైన్ నంబర్కు కాల్ చేసి, వారు ఏమి సేవను (ఉదా: రెస్టారెంట్లు, ఆసుపత్రులు, బ్యాంకులు మొదలైనవాటిని) వెతుకుతున్నారని ఆపేటర్లను అడిగి మరియు అది ఏ ప్రాతంలో ఉందొ తెలుస్కోవచ్చు .దీనితో ఆపరేటర్ ఫోనుకు సమాచారం గురించి ఒక ఇమెయిల్ మరియు ఒక SMS పంపబడుతుంది. అంతే కాకుండా, వినియోగదారులు వెబ్సైట్ అలాగే మొబైల్ అప్లికేషన్లలో ఏదైనా నిర్దిష్ట వ్యాపారం యొక్క సమాచారాన్ని వెతకవచ్చు.


కాలక్రమేణా సంస్థ పెరుగుతూ వచ్చింది అంతే కాకుండా ఆదాయం కూడా పెరిగింది ప్రస్తుతం కంపెనీ నికర ఆదాయం సుమారు అక్షరాలా 690.83 కోట్లకు పైబడే అన్నమాట.సంస్థ మొదట్లో కేవలం ఆరు మంది సిబ్బందితో మొదలై ప్రస్తుతం జస్ట్ డైల్ కంపెనీ లో సుమారు 11,000 పైగా ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు అని అంచనా.


మరింత సమాచారం తెలుసుకోండి: