ప్రతి ఏటా 1300 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతోంది. అందులో చాలా వరకూ వ్యర్థాల కుప్పగా పోగుపడుతూ వాతావరణ మార్పుకూ ఒక కారణమవుతోంది.మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ఆహార వృధా ఒకటి'' దాదాపు 900 కోట్ల మంది జనాభా ఉన్న భూగోళం మీద.. మనం ప్రతి స్థాయిలోనూ ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నాం. ప్రపంచంలో 82 కోట్ల మందికి పైగా ప్రజలకు తగినంత ఆహారం లభించటం లేదు.

ప్రపంచంలో ఉత్పత్తి చేస్తున్న మొత్తం ఆహారంలో మూడో వంతు ఆహారం వృధా కావటమో, కోల్పోవటమో జరుగుతోంది.ఆహార వృధా అంటే అర్థం కేవలం వృధా అయిన ఆహారం అనే కాదు. దాని అర్థం.. డబ్బులు వృధా అవటం, నీరు వృధా అవటం, ఇంధనం వృధా అవటం, భూమి వృధా అవటం, రవాణా వృధా అవటం.ఈ పరిస్థితిని మార్చటానికి మనం ఏం చేయగలమో చూద్దాం.


 తెలివిగా షాపింగ్ చేయటం,చాలా మంది తమకు అవసరమైన దానికన్నా ఎక్కువ కొనటానికి మొగ్గుచూపుతుంటారు.ఆహారాన్ని సక్రమంగా నిల్వచేయటం.ఆహారాన్ని సరిగా నిల్వచేయకపోతే భారీ స్థాయిలో వృధా అవుతుంది. పండ్లు, కూరగాయలను ఎలా నిల్వ చేయాలనేది చాలా మందికి తెలియదు.మిగిలిన ఆహారాన్ని దాచుకోవటం.తినగా మిగిలిన ఆహారాన్ని దాచి. వాటిని తర్వాత తినాలి.
మీరు ఎక్కువ మోతాదులో వండుతుంటే.. తరచుగా ఆహారం మిగులుతుంటే.. వాటిని ఫ్రిజ్‌లో పెట్టి ఒక రోజు వాటిని మాత్రమే ఉపయోగించేలా ప్రణాళిక అమలు చేయండి.


ఆహారాన్ని నిల్వ చేయటానికి దానిని ఫ్రిజ్‌లో ఫ్రీజ్ చేయటం అతి సులభమైన మార్గాల్లో ఒకటి. ఫ్రిజ్‌లో చక్కగా నిల్వ ఉండే ఆహారాలు అనేకం ఉన్నాయి.సలాడ్‌లో ఉపయోగించే అతి మృదువైన ఆకుకూరలను ఫ్రీజర్‌లో సేఫ్ బ్యాగ్‌లు లేదా టిన్నుల్లో పెట్టి నిల్వ చేసుకోవచ్చు. మనకు అవసరమైనపుడు వాటిని వాడుకోవచ్చు.సొంత ఆహారాన్ని వెంట తీసుకెళ్లటం.విధుల్లో ఉన్నపుడు మధ్యాహ్నాలు బయటకు వెళ్లి భోజనాలు చేయటం, ఇష్టమైన రెస్టారెంట్‌కి వెళ్లి తినటం ఆహ్లాదకరమే అయినా.ఆహార వృధాకు కూడా కారణమవుతుంది.


చివరిగా చెప్పేదేమంటే.మనమందరం ఆహార వృధాను అరికట్టవచ్చు. అందుకు ఎన్నో మార్గాలున్నాయి. మన ఇంట్లో ప్రతి రోజూ పారవేసే ఆహారం గురించి ఆలోచించటం ద్వారా.. భూమి మీద అత్యంత విలువైన వనరులను సంరక్షించటంలో సానుకూల మార్పు తీసుకురావటానికి దోహదపడగలం.



మరింత సమాచారం తెలుసుకోండి: