ఒక్క విషయంలో కోడి-మనిషి సేమ్ టు సేమ్. అందంగా, ఆకర్షణీయంగా ఉన్నవారినే ఎక్కువ మంది ఇష్టపడతారు. కోళ్లు కూడా అంతే.కోళ్లపై పరిశోధన చేసిన పలు దేశాలకు చెందిన పౌల్ట్రీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు. ఆ అధ్యయనంలో ఎన్నో ఆసక్తికర అంశాలు తెలుసుకున్నారు.'ఒక కోడి 30 వరకు ఇతర కోళ్లను గుర్తుపడుతుంది. పుట్టిన 24 నుంచి 36 గంటల్లో తల్లికోడి ముఖాన్ని కోడిపిల్ల గుర్తిస్తుంది' అని జార్జియా యూనివర్శిటీ పౌల్ట్రీ సైంటిస్ట్ క్లాడియా డుంక్లే చెప్పారు.కోళ్లు 'రెడ్ ట్రయాంగిల్‌ ఫొటో'ను కూడా గుర్తుపట్టినట్లు ఒక అధ్యయనం చెబుతోంది.


ఒకసారి కోడి మెదడులో ఫొటో ఫిక్సయిన తర్వాత, పాక్షికంగా చెరిపేసి చూపించినా ఆ ఫొటోను అవి గుర్తుపట్టేస్తున్నాయి.మెదడులో నిక్షిప్తమైన ఫొటోల ఆధారంగా ఎదురుగా ఉన్న వస్తువేంటో అవి పోల్చుకుంటున్నాయని నేషనల్ జియోగ్రఫిక్ వెబ్‌సైట్ కథనం ప్రచురించింది.మనుషుల్ని కూడా కోళ్లు గుర్తుపెట్టుకుంటాయట.ముఖం ఆధారంగా మనల్ని అవి గుర్తుపడతాయని తేలింది.ఇక్కడ మనిషికి-కోడికి దగ్గరి సంబంధం ఉంది.మనుషుల మాదిరిగానే కోళ్లు కూడా అందంగా, ఆకర్షణీయంగా ఉన్న వారినే ఎక్కువగా ఇష్టపడతాయని తేలింది.


ఈ విషయంలో కోళ్లకు-మనుషులకు సారూప్యత ఉందని 2002లో చేసిన అధ్యయనంలో ఒక అంచనాకు వచ్చారు.'అందమైన ముఖం ఉన్న వారిని మనుషులు ఎలా అయితే ఇష్టపడతారో, కోళ్లు కూడా అంతే' అని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన పౌల్ట్రీ సైంటిస్ట్ రిచర్డ్ బ్లాచ్‌ఫొర్డ్ అన్నారు.చెప్పిన పని సరిగా చేయనప్పుడు, ఎంత వివరించినా అర్థం చేసుకోనప్పుడు ఎదుటివారిని 'మట్టి బుర్ర', 'కోడి మెదడు' అని తిట్టడం తరచూ చూస్తుంటాం.కానీ మీరు అనుకుంటున్న దానికంటే కోళ్లు చాలా తెలివైనవి.ఆహారం ఎంత దూరంలో ఉందో కచ్చితంగా గుర్తిస్తాయి.ఆహారం ఉన్న ప్రదేశాన్ని మార్చినా.. అది ఎంతదూరంలో ఉందో కచ్చితంగా లెక్కలేస్తాయి.అంతేకాదు, తిరిగే పరిసరాలను అవి గుర్తు పెట్టుకుంటాయి.


గుడ్డు ముందా? కోడి ముందా? అనే చర్చ ఎప్పటి నుంచో నడుస్తోంది.దానికంటే ముందు మరో ప్రశ్నకు మీకు సమాధానం తెలిసి ఉండాలి.అసలు పుంజుకు- గుడ్డుకు ఉన్న సంబంధం ఏంటో మీకు తెలుసా?పుంజుతో కలవకుండా కోడిపెట్ట గుడ్డు పెట్టగలదా?కొందరు పెట్టదని, మరికొందరు పెడుతుందని చెప్పొచ్చు.అసలు నిజం ఏమిటంటే.. పుంజుతో కలవకుండానే కోటిపెట్ట గుడ్డు పెట్టగలదు.


మరింత సమాచారం తెలుసుకోండి: