"వితంతువు అయిన మా అమ్మ డోలా అధికారికి అర్హత కలిగిన వరుడు కావాలి. ఉద్యోగం నిమిత్తం నేను రోజూ ఎక్కువ సమయం ఇంటి బయటే ఉంటాను. అప్పుడు మా అమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఆమెకు తోడు కావాలి.పశ్చిమ బెంగాల్‌లోని హుగలీ జిల్లా చందన్‌నగర్ ఫ్రెంచ్ కాలనీకి చెందిన గౌరవ్ అధికారి అనే యువకుడు ఫేస్‌బుక్‌లో రాసిన పోస్ట్ ఇది గౌరవ్ తండ్రి ఐదేళ్ల క్రితం చనిపోయారు.


అప్పటి నుంచి ఆయన 45 ఏళ్ల తల్లి ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు."మా తల్లిదండ్రులకు నేనొక్కడినే సంతానం. మా నాన్న 2014లో చనిపోయారు. నేను ఉదయం 7 గంటలకు ఉద్యోగానికి వెళ్తాను, తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి అవుతుంది. దాంతో, రోజంతా మా అమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఎవరికైనా జీవిత భాగస్వామి లేదా స్నేహితులు ఉండాలన్న వాస్తవాన్ని గ్రహించాను. అందుకే మా అమ్మకు తోడు కోసం వెతుకుతున్నాను" అని గౌరవ్ చెప్పారు.



"నేను మా అమ్మతో మాట్లాడాను. ఆమె నా గురించి ఆలోచిస్తోంది. కానీ, నేను కూడా ఆమె గురించి ఆలోచించాలి. మా అమ్మ తన మిగతా జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను" అని అన్నారు."మా అమ్మ పేరు డోలా అధికారి. మా నాన్న ఐదేళ్ల క్రితం చనిపోయారు. ఉద్యోగం కారణంగా నేను రోజులో ఎక్కువగా ఇంటి బయటే ఉంటాను. దాంతో మా ఇంట్లో ఒక్కరే ఉండాల్సి వస్తోంది. మా అమ్మకు పుస్తకాలు చదవడం, పాటలు వినడం అంటే ఇష్టం. కానీ, ఆమెకు ఒక తోడు కావాలి. ఎందుకంటే, భాగస్వామి లేని లోటును ఆ పుస్తకాలు, పాటలు పూరించలేవని నా భావన


నేను ఉద్యోగంలో మరింత బిజీ అయిపోతాను. పెళ్లి చేసుకుంటాను. నాకు కుటుంబం ఉంటుంది. మరి మా అమ్మ పరిస్థితి? అందుకే మా అమ్మకు ఒక తోడు కావాలి. ఆయనకు ఆస్తిపాస్తులు ఉండాలని మేము అడగడం లేదు. మా అమ్మను బాగా చూసుకుంటే చాలు. నన్ను కొందరు ఎగతాళి చేస్తారు. అయినా, పట్టించుకోను. మా అమ్మకు కొత్త జీవితం కావాలి. అంతే" అని అని గౌరవ్ రాశారు.


"ఈ పోస్ట్ తరువాత, చాలా మంది నాకు ఫోన్ చేశారు. మా అమ్మను వివాహం చేసుకునేందుకు ఆసక్తి చూపారు. వారిలో వైద్యులు, మెరైన్ ఇంజనీర్లు, ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. అర్హత ఉన్న వ్యక్తిని చూసి మా అమ్మకు రెండో వివాహం చేయడమే ప్రస్తుతానికి నా ప్రధాన లక్ష్యం" అని ఆయన చెప్పారు."జనాలు వెనుక లక్షల రకాలుగా మాట్లాడతారు. కానీ, ఇప్పటివరకు ఎవరూ నా ముందు ఏమీ మాట్లాడలేదు. ప్రచారం కోసం నేను ఈ పోస్ట్ రాయలేదు. చాలా మంది యువతీ యువకులు తమ తల్లిదండ్రుల గురించి ఇలాగే ఆలోచించాలి. ఎవరేమనుకుంటారో అని భయపడకూడదు" అని గౌరవ్ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: