విదేశీయుడైన ఒక నిందితుడిని అరెస్టు చేయడం రాష్ట్రము లో సంచలనంగా మారింది. మనుషులను ఎంతటి పతనానికి అయినా దిగజార్చే గంజాయి, కొకైన్, హెరాయిన్‌ మొదలగు తదితర మత్తు పదార్థాలు పోలీసులతనిఖీల్ల బయటపడింది.పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు హౌసింగ్‌ బోర్డు కాలనీ సమీపంలోని ఆదర్శనగర్‌లో ఉన్న ఓక అపార్టుమెంట్‌లో కొంతకాలంగా అద్దెకు ఉంటున్న సౌదీ దేశానికి చెందిన డ్రగ్స్‌ వ్యాపారి షాజీ అలియాస్‌ మహమ్మద్‌ని సినీఫక్కీలో ప్లాన్ వేసి వెంటాడి శుక్రవారం రాత్రి నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

 

పోలీసులు ముందుగా విదేశీయుడితో ఎవరెవరికి  సంబంధాలు ఉన్న వారి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ముఠా సభ్యుల అన్వేషణ కోసం ప్రత్యేక బృందాల్ని అర్బన్‌ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ఏర్పాటు చేసినట్టు సమాచారం.ఒక విదేశీయుడు వచ్చి మన రాష్ట్రంలో డ్రగ్సు అమ్ముతున్న తీరు చూస్తే దీనికి ఎంత మంది యువత బలవుతున్నారో అర్థం కావడం లేదు.ఇప్పటికే గుంటూరులోని ఓ ప్రముఖ బిర్యానీ హోటల్‌ నిర్వాహకుడి కుమారుడితో పాటు మరో యువకుడితో నిందితుడికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు హోటల్స్ అయితే ఎవరికి అనుమానం రాదు అన్న భావనతో విదేశీయుడు హోటల్ వాళ్లతో పరిచయము పెంచుకున్నాడు.

 

విదేశీయుడు షాజీ పాస్‌పోర్టును బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు సీజ్‌ చేసినట్లు గుర్తించి వివరాలు సేకరిస్తున్నారు. అసలు ఎందుకు సీజ్‌ చేశారు..ఎప్పుడు సీజ్‌ చేశారు.. అనే అంశాల గురించి తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు.  
  ఐదు నెలల కిందట షాజీ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటూ ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్స్‌ వ్యాపారం చేసేవాడు. అక్కడ పోలీసుల నిఘా పెరిగినట్లు అనుమానించాడు.

 

అప్పటికే అతని కోసం రెక్కీ కొనసాగుతున్న విషయాన్ని పసిగట్టి అక్కడ నుంచి పరారయ్యాడు ఇక అక్కడే ఉంటే పోలీసులకు దొరికిపోతాను అని అనుమానం వచ్చి వేరే చోటకి మకాం మార్చాడు. ఆపై గుంటూరుకు చేరుకొని డ్రగ్స్‌ ముఠా సభ్యుల సహకారంతో ఆదర్శనగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఉంటూ గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం చేస్తున్నాడని విశ్వసనీయంగా తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: