ద్రవిడ భాషా కుటుంబం 4,500 సంవత్సరాల క్రితమే మనుగడలో ఉందా? అంటే అవుననే అంటోంది ఓ అధ్యయనం.అంతర్జాతీయ పరిశోధకుల అధ్యయనం ప్రకారం వారు ద్రవిడ భాషా కుటుంబ చరిత్రపై ఓ అధ్యయనం చేసింది..ఆ బృందంలో జర్మనీకి చెందిన ‘మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ’, భారత్‌లోని ‘వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’కు చెందిన పరిశోధకులు ఉన్నారు.

 

ద్రవిడ, ఇండో-యూరోపియన్, సినో-టిబెటన్.. ఇలా ఆరు భాషా కుటుంబాలకు చెందిన 600 భాషలకు దక్షిణ ఆసియా పుట్టినిల్లు అని చెప్పవచ్చు.ద్రవిడ భాషా కుటుంబంలో మొత్తం 80 రకాల భాషలు ఉన్నాయి. దక్షిణ భారతం, మధ్య భారతం, పొరుగు దేశాల్లో ప్రజలు ఈ భాషలు మాట్లాడుతారు. ద్రవిడ కుటుంబంలోని ప్రధాన భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ భాషలు అత్యంత ప్రాచీన సాహిత్య సంపదను కూడా కలిగివున్నాయి. సంస్కృతం లాగే తమిళ భాష కూడా పురాతనమైనది. తమిళ భాషా సంప్రదాయంలో ప్రాచీన కాలంలోని శాసనాలు, సాహిత్యానికి, వర్తమాన తమిళ భాషకూ సామీప్యత ఎక్కువ.

 

ద్రవిడ భాష ఎక్కడ పుట్టింది.. ఎట్లా విస్తరించింది అన్న అంశాల్లో ఇంకా కచ్చితత్వం రాలేదు. కానీ.. ద్రవిడులు భారత ఉపఖండ మూలవాసులేనని, 3,500 సంవత్సరాలకు పూర్వం ఇక్కడికొచ్చిన ఇండో-ఆర్యన్ల కంటే ముందే ఇక్కడ ఉన్నారన్న వాదనతో చాలామంది పరిశోధకులు ఏకాభిప్రాయాన్ని కలిగివున్నారు.


ద్రవిడ భాషలు ఎప్పుడు, ఎక్కడ అభివృద్ధి చెందాయి? అన్న ప్రశ్నలను శోధించడానికి.. 20 రకాల ద్రవిడ భాషల మధ్య ఉన్న ప్రాచీన సంబంధాలపై పరిశోధనలు జరిపారు. ద్రవిడ కుటుంబానికి చెందినవిగా భావిస్తున్న భాషలు మాట్లాడే స్థానికుల నుంచి ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. ద్రవిడ భాషలు 4,000 - 4,500 సంవత్సరాలు ప్రాచీనమైనవని చెప్తున్నారు పరిశోధకులు. ఇందులో అత్య అత్యాధునిక గణాంక పద్దతులను వాడారు. గతంలో జరిగిన అధ్యయనాల కంటే. ఈ అధ్యయనం మరింత పురోగతి సాధించిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: