వారం మొత్తం ఆఫీసులో పనిచేసి అలసిపోయి వీకెండ్ కోసం ఎదురు చూస్తాం. వీకెండ్లో రిలాక్స్ అవటానికి మీకోసం కొన్ని మంచి మార్గాలు కోసం సర్వే సేకరిస్తే సర్వేలో పాల్గొన్న వారిలో 58 శాతం మంది చదవటమే తమకు ఎక్కువ విశ్రాంతినిస్తుందని చెప్పారు. దీంతో ఈ సర్వేలో ఇదే టాప్‌గా నిలిచింది. జీవితంలో బాగా వృద్ధి చెందుతున్నామని భావిస్తున్న వారు చాలా మంది చదవటాన్ని ఎంచుకుంటారని తేలింది.

 

ప్రకృతితో గడపటం వల్ల తమకు మేలు జరుగుతుందని చాలా మంది ప్రజలు భావిస్తారన్న పరిశోధనను బలపర్చేలా ఈ అంశం రెండో స్థానంలో నిలిచింది. అయితే, మగవారి కంటే మహిళలే దీన్ని ఎక్కువగా ఎంచుకున్నారు. అసలు ఏమి చేయకపోవటం ఇది భలే తమాషా విషయం. 31 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉన్న వారు తప్ప మిగతా అంతా దీన్ని ఇష్టపడ్డారు. కొందరు మాత్రం ఇలా గడపటం చాలా కష్టమని చెప్పగా, 9 శాతం మంది ఈ రూపంలో విశ్రాంతి తీసుకోవటం తమను ఒత్తిడికి, అపరాధ భావనకు గురయ్యేలా చేసిందని చెప్పారు.

 

కొందరికి ఎక్కువ దూరం నడవటం ఇష్టం ఉండదు. కానీ, మరికొందరికి మాత్రం విశ్రాంతికి ఇదే సరైనదనిపిస్తుంది. ఇంకొందరు శారీరక వ్యాయామం ద్వారా మెదడును ప్రశాంతంగా ఉంచుకోవచ్చునని భావిస్తున్నారు. అయితే, 8 శాతం మంది మాత్రం రన్నింగ్ చేయటం విశ్రాంతిని ఇస్తుందంటున్నారు.

 

భిన్న వయస్కుల వారు భిన్నమైన అభిప్రాయాలతో ఉన్నప్పటికీ స్నానం చేయటం లేదా షవర్ కింద గడపటం అనేది విశ్రాంతినిస్తుందని చాలామంది భావించారు. ముఖ్యంగా 60 ఏళ్ల పైబడినవారు ఎక్కువ మంది దీన్ని ఎంచుకుంటే 18 నుంచి 30 ఏళ్ల మధ్యవారు మాత్రం దీన్ని తమ తమ జాబితాల్లో చివర్లో పెట్టారు.

 

టీవీ చూడడానికి మగవాళ్లకంటే ఎక్కువగా మహిళలు, పెద్దల కంటే ఎక్కువగా యువత దీన్ని ఎంచుకుంటున్నారు. అయితే, ఏ వయస్సు వాళ్లలో చూసుకున్నా చదవటం అనేది టీవీ చూడటం కంటే ముందుంది. తోట పనులు చేయటం, స్నేహితులతో గడపటం, సెక్స్ కంటే కూడా చాలామంది ధ్యానం చేయటానికే ప్రాధాన్యం ఇచ్చారు. బహుశా ఒక దశాబ్దం కింద ఇలా ఉండేది కాదేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: