ఒక మనిషి బ్రతకాలంటే ఆహారం నీరు గాలి కావాలి .. కానీ  ఆరోగ్యాంగా   బ్రతకాలంటే వీటి తో పాటు సరైన నిద్ర కూడా ఉండాలి ..సామాన్యంగా మనకు ఆఫీసులో భోజనం చేయగానే కండ్లు మూతలుపడుతుంటాయి. కానీ తప్పని పరిస్థితిల్లో కండ్లు నలుపుకుంటూ పనిచేయక తప్పదు.  అప్పుడు అందరి మనస్సులో మెదిలే ఆలోచన అబ్బా.. రోజంతా నిద్రపోయే జాబ్‌ ఉంటే ఎంతబాగుండునో . జపాన్‌లో లో లాగా మన ఆఫీసులో కూడా  కాసేపు పడుకోవడానికి టైం ఇస్తే   ఎంత బాగుండు అనిపిస్తుంది.  

 

ఇలా ఎప్పుడూ అనుకోవడమే గాని ఏనాడు ఏ యజమానీ వరం ఇవ్వడు. అని  ఎవరో అనుకుంటున్న సమయంలో దేవతలు తథాస్తు అన్నట్లున్నారు అలాంటి వాళ్ళకే ఈ ఉద్యోగం బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్‌ సంస్థ ‘రండి నిద్రపోండి.. రూ. లక్ష అందుకోండి’ అంటూ ఉద్యోగం ఆఫర్‌ చేస్తున్నారు.

 

ఉద్యోగం లో రోజుకు ఎనిమిది గంటలే కాకుండా గొడ్డు చాకిరీ చేపించుకునే సంస్థలను చూశాం కాని ఇలా నిద్రపోయే ఆఫర్‌ ఎప్పుడూ చూడలేదంటున్నారు నెటిజన్లు. అంతేకాదు, ఈ ఉద్యోగంలో భాగంగా రోజూ రాత్రి 9 గంటలు నిద్రపోతే చాలు. అయితే 100 రోజులపాటు తప్పకుండా ఈ డ్యూటీ చేయాలంటున్నారు.

 

స్లీప్‌ ప్యాట్రన్స్‌పై స్టడీ చేస్తున్న పరుపుల కంపెనీ ‘వేక్‌ఫిట్‌' ఈ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ స్లీప్‌ ఆఫర్‌కు దేశంలో ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం మనం చేయవలసింది  వెబ్‌సైట్‌ ‘వేక్‌ఫిట్‌ .కో ను సంప్రదించడం .  సంస్థ డైరెక్టర్‌ చైతన్య రామలింగ గౌడ మాట్లాడుతూ . 100 రోజుల ఈ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాం కోసం అభ్యర్థులు ప్రత్యేకంగా ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరు ఎంత బాగా నిద్రపోగలరో వివరిస్తే చాలు. వారి ఇంటికే కంపెనీ మ్యాట్రెస్‌, స్లీప్‌ ట్రాక్స్‌ పంపుతారు. ఈ ఉద్యోగానికి ఎంపికయ్యే అభ్యర్థులు వారు నిద్రపోయే సమయాన్ని వీడియో తీసి పంపాలని డైరెక్టర్‌ వివరించారు 

మరింత సమాచారం తెలుసుకోండి: