ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు మ‌రో సెంటిమెంటు అస్త్రాన్ని ప్ర‌యోగించారు. ఎప్పుడు.. ఎక్క‌డ ఎలాంటి అవ‌కాశం వ‌చ్చినా.. ఆయ‌న త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చ సాగుతుంది. గ‌తంలో త‌న సొంత బావ‌మ‌రిది హ‌రికృష్ణ రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన‌ప్పుడు దానిని త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నారనే చ‌ర్చ సాగింది. సీఎం హోదాలోనే ఆయ‌న అంత్య క్రియ‌ల్లోనూ పాలుపంచుకున్నారు. ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందు వంగి వంగి ద‌ణ్ణాలు పెట్టారు. త‌న‌కు అనుకూలంగా సెంటిమెం ట్ల‌ను ప్ర‌యోగిస్తూ.. చంద్ర‌బాబు రాష్ట్రం కోసం 18 గంట‌లు క‌ష్ట‌ప‌డుతున్నార‌ని, ఆయ‌న‌కు మీరిచ్చే కూలీ ఓటేన‌ని తెగ ప్ర‌చారం చేయించు కున్నారు.

 

త‌ర్వాత త‌న కుటుంబాన్ని కూడా సెంటిమెంటులోకి లాగారు. నేను ఎంతో సంపాయించుకున్నాను. నాకు కూడా కుటుం బం ఉంది. మ‌న‌వ‌డు ఉన్నాడు. నేను వెళ్లి కుటుంబంతో గ‌డ‌పాలంటే గ‌డ‌ప‌వ‌చ్చు.. కానీ, మీ కోస‌రం.. నేను అన్నీ ఒదులుకున్నా ను. ఇంటిని హైద‌రాబాద్‌లో పెట్టి మీకోసం బ‌స్సులో ప‌డుకున్నాను పాల‌న చేస్తున్నాను. ఇదంతా ఎవ‌రి కోసం చేస్తున్నాను. నా కోసం కాదు! క‌నీసం మ‌న‌వ‌డిని చూడాల‌ని అనుకున్నా.. మీలాగే ఆడుకోవాల‌ని అనుకున్నా..నేను ఆ బాంధ‌వ్యాన్ని వ‌దులుకు న్నాను. -అంటూ గ‌తంలో ఎక్క‌డ వేదికెక్కినా అక్క‌డ త‌న సెంటిమెంటును పండించేవారు.

 

ఈ క్ర‌మంలోనే ప‌సుపు-కుంకుమ వంటి సెంటిమెంటుతో ముడిప‌డిన కార్య‌క్ర‌మాన్ని ఎన్నిక‌ల‌స‌మ‌యంలో తీర్చిదిద్దారు. అయితే, ఎన్నిక‌ల్లో ఈ సెంటిమెంట్లు ఏవీ కూడా ప‌నిచేయ‌లేదు. పార్టీ స‌హా కీలక నాయ‌కులు ప‌రాజ‌యం పాలై.. అధికారం దిగిపోవాల్సి వ‌చ్చింది. ఇక‌, క‌ట్ చేస్తే.. ఇప్పుడు కూడా చంద్ర‌బాబు ఆ సెంటిమెంటును వీడ‌డం లేదు. సెంటిమెంటు క‌న్నా కూడా ప్ర‌జ‌ల్లో సుస్థిర‌మైన న‌మ్మ‌కం క‌లిగించుకుంటేనే పార్టీకి, చంద్ర‌బాబుకు మ‌నుగ‌డ అనే విష‌యాన్ని ఆయ‌న పెడ‌చెవిన పెడుతున్నారు. అలాగ‌ని ప్ర‌జ‌ల క‌ష్టాల్లో పాలు పంచుకోరాద‌ని ఎవ‌రూ చెప్ప‌రు.

 

కానీ, అమ‌రావ‌తి విష‌యాన్ని పెద్ద‌ది చేయ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. విజ్ఞ‌త కోల్పోయి కొంద‌రు కుర్ర‌కారు నాయ‌కులు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు, ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీగా అనుభ‌వం గ‌డించిన చంద్ర‌బాబుకు తేడా ఉంది. ఆ తేడా ఏంట‌నేది గ్ర‌హించి, దాని ప్ర‌కారం ముందుకు వెళ్తే.. చంద్ర‌బాబు కు తిరుగే ఉండ‌దు. కానీ, ఆయన అస‌లు విష‌యాన్ని ప‌క్క‌కు పెట్టి.. అభూత క‌ల్ప‌న‌కు , సెంటిమెంటుకు ప్రాధాన్యం ఇస్తున్నంత కాలం ఎన్ని పండ‌గ‌ల‌కు దూరం జ‌రిగినా.. ఒన‌గూరేది శూన్య‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: