కేంద్ర ఆర్థిక శాఖను తొలిసారి మ‌హిళ‌కు కేటాయించ‌డంతో దేశ‌వ్యాప్తంగా మ‌హిళ‌లు సంబ‌రం చేసుకున్నా రు. అయితే, గ‌త ఏడాదే తొలి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన నిర్మ‌లా సీతారామ‌న్‌.. మ‌హిళ‌లు ఆశించిన విధంగా వారికి న్యాయం చేయ‌లేక పోయార‌నే వాద‌న ఉంది. ముఖ్యంగా నిత్యావ‌స‌రాలు, దుస్తులు, గాడ్జెట్ల విషయం లో మ‌హిళ‌లు ప‌న్ను త‌గ్గింపుల‌ను కోరుకున్నారు. అయితే, వీటి విష‌యంలో అప్ప‌ట్లోనే నిర్మ‌ల నిరాస ప‌రి చారు. ఈ క్ర‌మంలో మ‌రోసారి 2020-21 కేంద్ర బ‌డ్జెట్‌లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జలు స‌హా మ‌హిళ‌లు ఎలాంటి ఆశ‌లు పెట్టుకున్నారు. వారికి మంత్రి ఎలాంటి న్యాయం చేయ‌నున్నారు? అనేది ఆస‌క్తిగా మారింది.

 

ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్న‌ది వీటిపైనే.. ఆదాయ‌ప‌న్ను ప‌రిధిని పెంచ‌డం, పెట్టుబ‌డుల‌పై ప‌న్నును త‌గ్గించ‌డం, గృహ రుణాలు, నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌పై విధించేప న్నుల‌ను త‌గ్గించ‌డం, జీల‌క‌ర్ర‌, దాల్చిన చెక్క‌, మిరియాలు, ఆవాల‌ను సుగంధ‌ద్ర‌వ్యాల జాబితా నుంచి త‌గ్గించ‌డం మ‌ధుమేహ ఔష‌ధాల పై ప‌న్నురాయితీలు కోరుతున్నారు. వీటినే కొంచెం వివ‌రంగా చూస్తే.. గతేడాది కేంద్రం కార్పొరేట్‌ పన్ను తగ్గించడంతో వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపుదారులకూ ఊరట కల్పించాలన్న డిమాండ్‌ వ్యక్తమవు తోంది.

 

ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచడంతోపాటు సెక్షన్‌ 80సీ పరిమితినీ పెంచాలని కోరుతున్నారు. దీర్ఘకాలం పెట్టుబడిపై లాభాల పన్ను (ఎల్‌టీసీజీ), డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ (డీడీటీ)ను ఎత్తివేయ డం లేదా తగ్గించాలని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రైవేట్‌ రంగ పెట్టుబడులు పెంచేలా చర్యలు చేపట్టాలని కార్పొరేట్‌ రంగం ఆశిస్తోంది. ముఖ్యంగా మౌలిక ప్రాజెక్టుల కోసం పెట్టుబడుల సేకరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుకుంటోంది.

 

గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వినియోగం పెంచేందుకు పీఎం కిసాన్‌, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకాలకు కేటాయింపులు పెంచాలంటున్నారు. స్థిరాస్తి కొనుగోళ్లకు ఊతమిచ్చేందుకు గృహ రుణ వడ్డీ చెల్లింపులపై వార్షిక పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని కోరుతున్నారు. ప్రస్తుతమీ పరిమితి రూ.2 లక్షలుగా ఉంది. మ‌రి నిర్మ‌ల‌మ్మ ఈ భార‌త‌వాని ఘోర ప‌ట్టించుకుంటారా ?  లేక మోడి చెప్పిన‌ట్టు నిర్మ‌లంగా బ‌డ్జెట్‌ను చ‌దివేస్తారా ? అన్న‌ది చూడాలి.

 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: