దాదాపు 55 ఏళ్ల వ‌య‌సు! ఏ వ్య‌క్తి అయినా.. అటు పురుషుడైనా.. ఇటు మ‌హిళ అయినా.. ఈ వ‌య‌సు వ‌చ్చే స‌రికి స‌గం జీవితం ముగిసింద‌ని నిశ్చితాభిప్రాయానికి వ‌స్తారు. అయితే, అంద‌రి ఆలోచ‌న‌ల‌కు భిన్నంగా.. పుట్టుక‌తోనే అన్నీ ఉండి.. కాలు కూడా క‌ద‌ప‌కుండా కుటుంబాన్ని నిర్వ‌హించుకునే అవ‌కాశం ఉండి కూడా ఆ వ‌య‌సులో రోడ్డెక్క‌డం అంటే ఎంత మందికి సాధ్యం?! ఎక్క‌డో నూటికి ఒక్క‌రు అంటారు చూడండి.. అ లా ఓ వెయ్యి మందిలో ఒక్క‌రు మాదిరిగా వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి కుటుంబం నుంచి ప్ర‌జాక్షేత్రంలోకి అడు గు పెట్టారు ఆయ‌న సతీమ‌ణి విజ‌య‌మ్మ‌. నిజానికి ఆమె ఏ ప‌రిస్థితిలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారో అంద‌రికీ తెలి సిందే.

 

కానీ, ఆ ప‌రిస్థితిని పంటిబిగువున భ‌రించి .. త‌న ల‌క్ష్యం దిశ‌గా విజ‌య‌మ్మ వేసిన అడుగులు న‌భూతో .. న ‌భ విష్య‌తి.. అన్న నానుడిని అక్ష‌రాలా నిజం చేశాయి. ఒక విమ‌ర్శ‌ను, ఒక క‌ష్టాన్ని తేలిక‌గా తీసేయ‌కుం డా.. ఆమె త‌ను అనుకున్న మార్గంలో ప‌ర్య‌టించారు. ప‌ట్టుద‌ల‌తో ముందుకు సాగారు. చెర‌గ‌ని చిరున‌వ్వే ఆభ‌ర ణంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యారు. త‌న భ‌ర్త అడుగుజాడ‌ల్లో పేద‌ల ప‌క్ష‌పాతిగా ఆమె ముద్ర వేసుకున్నా రు. ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ త‌న కుమారుడికి ఇవ్వాల‌ని కోరినా.. వైఎస్ ఆశ‌య సాధ‌న‌లో త‌న కుటుం బం అహ‌ర‌హం శ్ర‌మిస్తుంద‌ని చాటినా.. ఆమెకే చెల్లింది. 

 

ఆమె త‌ను న‌మ్మిన సిద్ధాంతాన్ని ఔద‌ల‌దాల్చి ఓర్పు-స‌హ‌నాల‌నే పెట్ట‌ని కోట‌లు చేసుకుని ముందుకు సాగారు. నిజానికి ప‌ట్టుద‌ల‌ను మించిన రాజ‌మార్గం లేద‌ని అంటారు. ఆ ప‌ట్టుద‌లే విజ‌య‌మ్మకు వ‌ర‌మైంది. తా ము న‌మ్మిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్న‌డూ ఊహించ‌ని విధంగా ఎదురైన ప‌రాభ‌వాన్ని దిగ‌మింగి.. త‌న కు మారుడు స్తాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే వ‌ర‌కు కూడా ఆమె విశ్రమించ‌కుండా శ్ర‌మించారు. ఒకానొక ద‌శ‌లో ఇక పార్టీ ఉంటుందా? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు కూడా ఆమె ఎక్క‌డా కుంగిపోలేదు. 

 

ప్ర‌జ‌ల‌ను న‌మ్ముకున్న నాయ‌కుల‌కు, పార్టీల‌కు ఏనాడూ అన్యాయం జ‌ర‌గ‌ద‌ని సంపూర్ణంగా విశ్వ‌సించిన విజ‌య‌మ్మ‌.. పార్టీ కోసం.. ఎంతో శ్ర‌మించారు. ప‌ట్టుద‌ల‌తో రాజ‌కీయంగా ప్ర‌జ‌ల మ‌ధ్య ఎదిగి.. ఏ పార్టీ అయితే... త‌మ‌ను అవ‌మానించిందో.. ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేసే వ‌ర‌కు ప‌రిశ్ర‌మించారు. అందుకే ఒక ప‌ట్టుద‌ల‌.. మ‌లిచిన నాయ‌కురాలిగా విజ‌య‌మ్మ ప్ర‌స్థానం ఈ రాష్ట్రంలో చిర‌స్థానం!

మరింత సమాచారం తెలుసుకోండి: